టాలెంటెడ్ హీరో సత్యదేవ్ వరుస సినిమాలతో కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసాడు. ఆ సినిమాకు ఎంత మంచి విమర్శలు దక్కాయో తెలుసు. ఇక ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ రీమేక్ గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనితో పాటు నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేయనున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో కలిసి ఎస్ ఒరిజినల్స్ బ్యానర్‌పై నిర్మాత సృజన్ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ కూడా ఇప్పటికే రిలీజ్ అవ్వగా త్వరలోనే సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు సైలెంట్ గా మరో సినిమాను పూర్తి చేసేసాడు సత్యదేవ్. సైలెంట్‌గా సినిమాను ఫినిష్ చేసేసి విడుదల చేసేస్తున్నాడు. సత్యదేవ్, ప్రియాలాల్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘గువ్వ గోరింక’. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బమ్మిడి దర్శకత్వం వహించిన ఈసినిమాను.. జీవన్, దాము సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా ఈనెల 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలోభాగంగానే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
శిరీష సదానంద్‌ల గువ్వ గోరింక లాంటి ప్రేమ కథ! Here’s the trailer of #GuvvaGorinka
▶️ https://t.co/RkPhWNQzFG#GuvvaGorinkaOnPrime Premieres Dec 17 on @PrimeVideoIN@ActorSatyaDev @PriyaaLal #MohanBammidi @eyrahul @priyadarshi_i #SureshBobbili
— Telugu FilmNagar (@telugufilmnagar) December 12, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: