తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్నో చిత్రాలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచాయి. అసలు క్లాసిక్ అనే పదానికి అర్ధం ఆక్స్ ఫర్డ్ నిఘంటువు ప్రకారం “కాలం గడిచేకొద్దీ ఒక కళ పనితనం యొక్క స్థాయి, నాణ్యత ఎప్పటికి తగ్గిపోకుండా స్థిరంగా నిలిచిపోవడం”. అలాంటి తెలుగు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా నిలిచినా కొన్ని చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో ప్రదర్శితమౌతున్నాయి. వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ ప్రయత్నానికి ముఖ్య కారణం ప్రస్తుత తరం మరచిపోయిన ఆ క్లాసిక్స్ ని మళ్ళీ ఒకసారి వారు గుర్తుచేసుకోవాలని. భారతీయ సినిమాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ ఎన్నో ఉన్నాయి. కాలం మారుతున్న కొద్దీ కొత్త కథలు పుడుతూనే ఉంటాయి అయినా సరే పాత ఆణిముత్యాలు ఎప్పటికి కొత్తగానే ఉంటాయి. మంచి సినిమాలు అన్ని చూసేశాము అనే భావనలో ఉన్న వాళ్ళు ఉంటే గనక అమెజాన్ ప్రైమ్ లో ఉన్న ఈ చిత్రాలను మళ్ళీ ఒకసారి వీక్షించండి. ఈ సినిమాలు చూశాక మ్యాజిక్ ఆఫ్ సినిమా అంటే ఏంటో మరోసారి అనుభవంలోకి తెచ్చుకుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
తెలుగు చలన చిత్ర చరిత్రలో అరుదైన కళాఖండాలను నిర్మించిన సంస్థ విజయ వాహిని స్టూడియోస్. అలాంటి చిత్రాల్లో పాతాళ భైరవి ఒక కలికితురాయి. తెలుగు చిత్ర సీమ లో సిసలైన జానపద చిత్రాలకు ఈ సినిమా జీవం పోసింది. పాతాళ భైరవి తెలుగు సినిమా వైభవానికి ఒక నిలువుటద్దం. 200 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఒకే హీరో తో నిర్మాణం జరుపుకున్న తొలి ద్విభాషా చిత్రం ఇది. తోట రాముడిగా నందమూరి తారక రామారావు గారి సాహసాలు, నటన. నేపాల మాంత్రికుడిగా SV రంగారావు గారి నటన తెలుగు చిత్ర చరిత్రలో చిర స్థాయిగా నిలిచింది అలాగే ఎన్టీఆర్ గారిని ఈ చిత్రం అగ్ర కథానాయకుడిగా నిలిపింది.
ఈ చిత్రాన్ని చూడడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి :
1951వ సంవత్సరంలో విడుదల అయిన మల్లీశ్వరి చిత్రం ఇప్పటికి ఒక మరపురాని చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. శ్రీకృష్ణ దేవరాయలు వారి గురించి బుచ్చిబాబు రచించిన రాయలవారి కరుణాకృత్యం మరియు దేవన్ షెరార్ రాసిన “ది ఎంపరర్ అండ్ ది స్లేవ్ గర్ల్” అనే రచన నుంచి తీసుకొని దేవులపల్లి కృష్ణ శాస్త్రి ఈ చిత్ర కథను రూపొందించారు. నాగరాజు (ఎన్టీఆర్), మల్లీశ్వరి (భానుమతి)ల అపురూప ప్రేమ కావ్యమే ఈ చిత్రం. 1952వ సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం ప్రదర్శితం అయింది. CNN – IBN 2013 లో ప్రకటించిన ఆల్ టైం వంద భారతీయ గొప్ప చిత్రాల్లో “మల్లీశ్వరి” చిత్రం స్థానం సంపాదించింది.
ఈ చిత్రాన్ని చూడడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి :
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రావు గారు నటించిన 100వ చిత్రం గుండమ్మ కథ. అక్కినేని నాగేశ్వర్ రావు, సావిత్రి, S V రంగారావు, సూర్యకాంతం గారు నటించిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ కథ చిత్రాల్లో మరపురాని చిత్రంగా నిలిచిపోయింది. గయ్యాళి గుండమ్మ పాత్రలో సూర్యకాంతం గారి నటన ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ గయ్యాళి పాత్ర అంటే సూర్యకాంతం గారే అని గుర్తుకు వస్తుంది అంటే ఆ పాత్ర ఎంతలా పండిందో చెప్పుకోవచ్చు.
ఈ చిత్రాన్ని చూడడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి :
తెలుగు చలన చిత్ర చరిత్రలో అద్భుత దృశ్య కావ్యాల్లో మూగమనసులు చిత్ర స్థానం ప్రత్యేకం. అవుట్ డోర్ లో చిత్రీకరణ జరుపుకున్న మొట్ట మొదటి చిత్రం ఇది. మొట్ట మొదటగా పూర్వ జన్మ ఇతివృత్తంతో వచ్చిన ఈ సినిమా ఆ తర్వాత చలన చిత్ర పరిశ్రమలో వచ్చిన ఎన్నో పూర్వ జన్మ చిత్ర కథలకి ఈ చిత్రమే ఆదర్శంగా నిలిచింది. కథకి తోడు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర్ రావు, మహానటి సావిత్రి, జమున గార్ల నటన కౌశల్యం ఈ చిత్రాన్ని ఒక అద్భుత దృశ్య కావ్యంగా మలిచింది. ఈ చిత్ర పాటలు సినిమాను మరో ఎత్తుకు తీసుకెళ్లి ఒక క్లాసిక్ చిత్రంగా నిలిపింది.
ఈ చిత్రాన్ని చూడడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి :
ఇప్పటి వరకు తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఎన్నో సినిమాలు వచ్చినా అవేకళ్ళు చిత్రాన్ని మించి గొప్ప థ్రిల్లర్ చిత్రం రాలేదు అంటే ఆ సినిమా గొప్పతనం ఏంటో తెలుసుకోవచ్చు.. ఈస్ట్ మన్ కలర్ లో పూర్తిస్థాయిలో చిత్రీకరణ జరుపుకున్న తొలి చిత్రాల్లో ఇది ఒకటి. మర్డర్ మిస్టరీ ని ఛేదించే క్రమంలో ప్రతి క్షణం వచ్చే సస్పెన్స్, మలుపులు ప్రేక్షకులను కళ్ళు తిప్పనివ్వకుండా చేసి ఆల్ టైం క్లాసిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెలుగు సినీ చరిత్రలో సగౌరవంగా నిలిచింది.
ఈ చిత్రాన్ని చూడడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి :
భక్తి రస చిత్రాలు తెలుగులో కోకొల్లలు. అలాంటి చిత్రాలలో నోము సినిమాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ AVM బ్యానర్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. దేవుడంటే నమ్మకం లేని ఈశ్వర్ (రామకృష్ణ)కు దైవమంటే నమ్మకం ఉండే పార్వతి (చంద్రకళ)కి వివాహం జరుగుతుంది. కొందరు వ్యక్తులు ఈ దంపతుల మధ్య చిచ్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలను ఒక నాగు పాము ఏ విధంగా భంగపరిచింది అనేదే ఈ సినిమా. కథ, కథనం, నటి నటుల పర్ఫెర్మన్సు పదే పదే ఈ చిత్రాన్ని చూసేలా చేశాయి. మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో భారతదేశం తరపున ఈ చిత్రం ప్రదర్శితం అయింది. “కలిసే కళ్ళలోన” అనే ఎవర్ గ్రీన్ గీతం ఈ చిత్రం లోనిదే.
ఈ చిత్రాన్ని చూడడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి :
ప్రఖ్యాత కే. బాలచందర్ గారు తన దర్శకత్వంతో సామాజిక సమస్యల మీద ఎక్కుపెట్టిన అస్త్రమే ఈ ఆకలి రాజ్యం. సమాజం లో ఉన్నా కుల వర్గ బేధాలు. నిరుద్యోగత. ధనిక, పేద తరగతిల మధ్య తారతమ్యాన్ని ప్రశ్నించిన సినిమా ఇది. ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం, బతకడం కొరకు ఏ విధంగా యుద్ధం చేశాడు. సమాజాన్ని ఎలా ప్రశ్నించాడు అనేది ఈ వెండితెర మహాద్భుతం. నిరుద్యోగి పాత్రలో ఉద్యోగం కోసం వెతుక్కునే ఒక యువకుడిగా, తనవైన ప్రశ్నలతో సమాజాన్ని మేల్కొలిపి సాంఘీక అసమానతలను దూరం చేయడానికి రంగ పాత్రలో కమల్ హాసన్ గారి నటన ఈ సినిమాను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది.
ఈ చిత్రాన్ని చూడడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం చేసిన మాయాజాలమే ఈ రోజా చిత్రం. ఒక ప్రేమకథకి దేశభక్తిని జోడించి అల్లుకున్న ఈ కథ సమకాలిక పరిస్థితులకు అద్దం పట్టింది. ప్రేమ, టెర్రరిజం, కశ్మీర్ అనే సెన్సిటివ్ పాయింట్స్ కథలో మిళితం అవ్వడంవల్ల ఈ చిత్రం మధురమైన ప్రేమ కావ్యంగా, దేశభక్తి చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న కథ అంశాలన్నిటికి విభిన్నంగా ఉండి, ఆ తర్వాత విభిన్నమైన కథాంశాలతో చిత్రాన్ని తెరకెక్కించొచ్చు అనే విషయాన్ని తెలియజేసింది.
ఈ చిత్రాన్ని చూడడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి :
ఒక గురువు తన కన్నా ఎత్తుకి తన శిష్యుడు ఎదుగుతుంటే ఓర్వలేక ఆ శిష్యుణ్ణి ఆపే క్రమంలో ఆ గురువు ఎంతలా దిగజారిపోయాడు అనేదే ఈ సినిమా కథ. లలిత కలల గురించి ఎన్నో చిత్రాలు వెండితెర మీదకి వచ్చినా సంగీత కళ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఎప్పటకీ ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. విశ్వంలో ప్రతి ఒకదానికి రెండు కోణాలు ఉంటాయి. నిజం, అబద్దం. పగలు, రాత్రి అలాగే మంచి, చెడు. కళాతపస్వి కే. విశ్వనాథ్ గారు ఆ రెండు కోణాలు గురువులో ఉంటే ఎలా ఉంటుందో ఈ చిత్రంతో చూపించాడు. గురువుగా మమ్ముట్టి నటన, K V మహదేవన్ గారి సంగీతం ఈ చిత్రాన్ని క్లాసిక్స్ చిత్రాల్లో ఒకటిగా నిలిపాయి.
ఈ చిత్రాన్ని చూడడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి :
టెక్నాలజీ ఎక్కువగా అందుబాటులో లేని రోజుల్లో 3D సాంకేతికతను, గ్రాఫిక్స్ ని వాడుకొని బాలయ్య గారు మరియు సింగీతం శ్రీనివాసు గారు చేసిన వెండితెర మాయ జాలమే ఈ సినిమా. ఒక జానపద కథకి సాంకేతికతను జోడించి రూపొందించిన ఈ చిత్రం ఆనాటి ఆబాలగోపాలాన్ని అలరించింది. ఈ సినిమా కథ, కథనం, గ్రాఫిక్స్ కి ఎవరైనా అబ్బురపడాల్సిందే. సినీలోకం అప్పటి వరకు చూడని మాయలు ఈ చిత్రం చూపించింది. అవన్నీ కలిసి చిత్రాన్ని ఎవర్ గ్రీన్ గా నిలిపాయి.
ఈ చిత్రాన్ని చూడడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి :
కొన్ని సినిమాలు మనల్ని నవ్విస్తాయి, మరికొన్నీ గుండెల్ని బరువెక్కించి ఏడిపిస్తాయి. మొదటి వర్గంలోని చిత్రాలు సినిమా చూసిన కాసేపటికి మరిచిపోతాం. ఎప్పుడో ఒకసారి గుర్తుచేసుకొని నవ్వుకుంటాం. కానీ రెండో వర్గంలోని చిత్రాలను అంత త్వరగా మరచిపోకుండా గుండెల్లో పెట్టేసుకుంటాం. కానీ యమలీల చిత్రం మూడవ వర్గానికి సంబంధించినది. సినిమా చూస్తున్నంతసేపు నవ్విస్తూ ఆ తర్వాత సెంటిమెంటుతో ఏడిపించి తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎప్పటికి చిర స్థాయిగా నిలిచిపోయిన చిత్రం ఇది. యముడిని భూలోకానికి రప్పించి ఆటలాడిస్తూ చివర్లో తల్లి సెంటిమెంట్ తో మన హృదయాల్ని ఈ చిత్రం ద్రవింపజేస్తుంది.
ఈ చిత్రాన్ని చూడడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి :
తెలుగులో కుటుంబ కథా చిత్రాల్లో ఎప్పటికి నిలిచిపోయే ఎవర్ గ్రీన్ చిత్రం పెదరాయుడు. అద్భుతమైన కుటుంబ కథా చిత్రం, ఆప్యాయత అనురాగాలు, విలువలు, బంధాల గురించి గొప్పగా చెపుతూ ఒక కమర్షియల్ చిత్రాల్లో ఉండాల్సిన ఫైట్స్, పాటలు, కామెడీ లతో ఆ చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఏడిపించే సెంటిమెంట్ సన్నివేశాలు, భావోద్వేగాలకు గురిచేసే ఎమోషనల్ సన్నివేశాలతో కట్టిపడేస్తుంది పెదరాయుడు. పేదరాయుడిగా మోహన్ బాబు గారి నటన ఒక స్థాయి లో ఉంటే, పాపారాయుడిగా రజనీకాంత్ గారి నటన ఈ సినిమాను మరోస్థాయిలో నిలిపాయి.
ఈ చిత్రాన్ని చూడడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి :
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.