హేమంత్ మధుకర్… ఈ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే అనుష్క, విలక్షణ నటుడు మాధవన్‌లతో కలిసి ‘నిశ్శబ్దం’ సినిమాను తెరకెక్కించగా.. ఆ సినిమాను అమెజాన్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మిశ్రమ ఫలితం దక్కగా.. వ్యూయర్స్ పరంగా మాత్రం బిగ్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు హేమంత్ మధుకర్ మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో ఒకటి యాక్షన్ రొమాంటిక్ చిత్రం. ఈ చిత్రానికి రచయిత గోపీమోహన్ స్ర్కీన్‌ప్లే అందిస్తున్నారట. ఈ చిత్రం కూడా ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని రూపొందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మించనుందని తెలుస్తుంది.
మరో చిత్రం బాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రంగా రూపొందనుందట. గతంలోనే హేమంత్ బాలీవుడ్‌లో ‘ఏ ఫ్లాట్’ అనే సినిమాను తీసి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు ‘బాతే’ అనే టైటిల్‌తో మల్టీస్టారర్ చిత్రం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘కహానీ, పింక్’ చిత్రాల రచయిత రితేష్ షా స్ర్కీన్‌ప్లే అందించనున్నారని, ఈ చిత్రం 70 శాతం షూటింగ్ లండన్‌లో జరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ఇవ్వనున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: