మిడిల్ క్లాస్ మెలోడీస్ – మంచి కామెడీ ఎంటర్ టైనర్

Anand Deverakonda and Varsha Bollamma Starrer Middle Class Melodies Is A Fun Filled Comedy Entertainer

మొదటి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేసాడు ఆనంద్ దేవరకొండ. ఇక ఇప్పుడు రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ తో తన అదృష్టం పరీక్షించుకోడానికి వస్తున్నాడు. వినోద్ అనంతోజు దర్శకత్వంలో వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు అమెజాన్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ట్రయిలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు చిత్రయూనిట్. మరి ఆ అంచనాలను రీచ్ అయ్యాడా లేదా అన్నది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : ఆనంద్ దేవరకొండ, వర్షా బొల్లమ్మ, గోపిరాజు రమణ, చైతన్య గరికపాటి, తరుణ్ భాస్కర్ తదితరులు
దర్శకత్వం : వినోద్‌ అనంతోజు
సంగీతం : స్వీకర్ అగస్తి
నిర్మాత : వెనిగళ్ల ఆనంద ప్రసాద్

కథ

గుంటూరు ద‌గ్గ‌ర కొల‌క‌లూరు గ్రామంలో కొండ‌ల‌రావు (గోపరాజు రమణ) చిన్నహోటెల్‌ నడిపిస్తుంటాడు. కొండ‌ల‌రావు కొడుకే రాఘవ (ఆనంద్ దేవరకొండ). తండ్రి హోటల్ నడిపిస్తుండటంతో రాఘవకు కూడా చిన్నప్పటి నుండి గుంటూరులో హోటల్ పెట్టి.. దాన్ని సక్సెస్ చేయాలని కలలు కంటూ ఉంటాడు. తాను చేసే బొంబాయ్ చెట్నీతో.. గుంటూరులో హోటల్ పెట్టి.. ఫెమస్ అవ్వాలనుకుంటాడు. దీనికోసం గుంటూరులో హోటల్ లీజు తీసుకుంటాడు. హోటల్ పెట్టడానికి కష్టాలు పడిన రాఘవకు హోటల్ తెరిచినా లాభముండదు. మరోవైపు అతని మరదలు సంధ్య (వర్షా బొల్లమ్మ) అంటే రాఘవకు చిన్నప్పటి నుండి ఇష్టం ఉంది. సంధ్యకి ఆమె తండ్రి పెళ్లి సంబంధాలు చూస్తుంటాడు. సంధ్యను పెళ్లి చేసుకోవాలంటే హోటల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వాలి. బొంబాయ్ చట్నీ మీద నమ్మకంతో హోటల్ పెట్టిన రాఘవ సక్సెస్ అవుతాడా? ప్రేమించిన సంధ్యని రాఘవ దక్కించుకున్నాడా? అనేదే మిడిల్ క్లాస్ మెలోడీస్ కథ.

విశ్లేషణ.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదో చేయాలన్న ఆశలు ఉన్నా ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించవు. ఎన్నో కాంప్రమైజ్ లు ఉంటాయి. ఎన్నో సర్దుకోవాల్సి ఉంటుంది. అలాంటి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కథే ఈ మిడిల్ క్లాస్ మెలోడీస్. మిడిల్ క్లాస్ వాళ్ల ఆలోచనలు.. ఆర్ధిక పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాలు చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్.

ఆనంద్ దేవరకొండ ఈ సినిమాలో మిడిల్ క్లాస్ కుర్రాడు రాఘవ పాత్రలో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. బొంబాయ్ చెట్నీ బొంబాయ్ చెట్నీ అంటూ హోటల్ పెట్టడానికి కష్టాలు పడే యువకుడిగా.. ప్రేమ కోసం పాట్లు పడే ప్రేమికుడిగా.. తన తండ్రి ప్రతి పనిలో అడ్డం పడే కొడుకుగా.. ఆనంద్ దేవరకొండ మంచి నటన కనబర్చాడు. నిజానికి మొదటి సినిమా వేరు.. రెండో సినిమా వేరు. ఈ సినిమాలో చాలా స‌హ‌జంగా చేశాడు. నిజంగా ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిని తెర‌పై చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది.

ఇక ఈ సినిమాకి ఆనంద్ దేవరకొండ ఎలా హైలైటో తండి పాత్రలో చేసిన గోపరాజు రమణ పాత్ర కూడా మరో హైలైట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ చూసినప్పుడే ఈయన పాత్ర సినిమాకు హైలైట్ అవుంతుందన్న విషయం అర్ధమవుతుంది. అలానే ఎలాంటి డిసప్పాయింట్ కు గురవ్వరు. మధ్యతరగతి ఇంట్లో ఒక తండ్రి ఎలా ఉంటాడో గోపరాజు రమణ పాత్ర చూస్తే అర్ధమవుతుంది. ఆ పాత్రని దర్శకుడు బాగా హైలెట్ చేసాడు. ఈ సినిమా చూసిన వాళ్లకు కొండలరావు పాత్ర చాలా కాలం గుర్తుండిపోతుంది.

ఇక హీరోయిన్ వర్ష బొల్లమ్మ విషయానికి వస్తే ట్రెడిషనల్ గా.. లుక్స్ పరంగా వర్ష ఆకట్టుకుంది. కొన్ని చోట్ల అమాయకంగా క్యూట్ గా క‌నిపించింది. ఆనంద్ ఫ్రెండ్ గా నటించిన చైతన్య, గెస్ట్ రోల్ చెసిన తరుణ్ భాస్కర్ మిగతా నటీనటులు వారి వారి పాత్రల మేర బాగా నటించారు.

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హీరో లవ్ స్టోరీ, హోటల్ పెట్టాలని దానికోసం తిరగడం.. తండ్రి తిట్లు ఇలానే సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో కొంచం డ్రామా పెట్టాడు. హోటల్ ఓపెన్ చేసినా.. తప్పని కష్టాలు, ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి సంబంధాలు.. వాటివల్ల హీరోకు ఫ్రస్టేషన్ .. స్నేహితుడి జాతకాల పిచ్చితో ప్రేమను దూరం చేసుకోవడం లాంటి విషయాలు చూపించాడు. అయితే స్వచ్ఛమైన ప్రేమ కథ, జీవితంలో పైకి ఎదగాలనే యువకుడి తపన ని బాగా ప్రెజెంట్ చేసాడు డైరెక్టర్.

ఇక స్వీకర్ అగస్తి అందించిన పాటలు చాలా బాగున్నాయి. R H విక్రమ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఈ సినిమాకు మరో ఆకర్షణ. సన్నివేశాలకు తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి తన పాత్రకు న్యాయం చేసాడు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చాలా సహజత్వంతో గుంటూరు పరిసరాలను, పల్లెటూరి అందాలను చూపించాడు. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే ఇంటిల్లిపాది హాయిగా చూడదగిన చిత్రం ఈ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =