షూట్ కు రెడీ అయిన బాలయ్య

Nandamuri Balakrishna Gets Ready To Join Boyapati Sreenu Movie Shooting

ఇప్పటికే టాలీవుడ్ మొత్తం షూటింగ్ లతో బిజీ అయిపోయింది. ఇక ఇన్ని రోజులు రెస్టింగ్ మోడ్ లో ఉన్న హీరోలందరూ షూటింగ్ లతో బిజీ అయిపోతుంది. ఇప్పుడు బాలయ్య కూడా షూట్ కు రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే బోయపాటి షూట్ ను స్టార్ట్ చేసాడు. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు. అయితే ఈ షూటింగ్ లో బాలయ్య పాల్గొనలేదు. ఈ రోజునుండి మరో షెడ్యూల్ ప్రారంభం కానుండగా.. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ కూడా పాల్గొననున్నాడట. అంతేకాదు హీరోయిన్ సయేషా, పూర్ణ కూడా ఈషెడ్యూల్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర చేయనున్నాడు. వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం విశేషం. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

మరి ఈ సినిమాతో వీరు హ్యటిక్ కొడతారో లేదో చూద్దాం. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి – బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా ఇది. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 8 =