టిల్లు స్క్వేర్ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది 

Tillu Square arrives from 26th April on Netflix

హనుమాన్ తరువాత ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది టిల్లు స్క్వేర్.బ్లాక్ బాస్టర్ డీజే టిల్లు కు సీక్వెల్ గా మంచి అంచనాల తో వచ్చిన ఈసినిమా అంచనాలను దాటి ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 127కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఈసినిమాతో హీరో సిద్దు తొలిసారి 100కోట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే విడుదలైన నెల లోపే ఈసినిమా ఓటిటి లోకి రానుంది.భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ ఈ రైట్స్ ను దక్కించుకుంది.ఈనెల 26నుండి ఈసినిమాను దక్షిణాది భాషలతోపాటు హిందీ లో కూడా స్ట్రీమింగ్ లోకి తీసుకురానున్నామని తెలిపింది.

ఇక ఈసినిమా తరువాత ప్రస్తుతం సిద్దు చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు వున్నాయి.అందులో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో జాక్ కొంచెం క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు.ఎస్విసిసి ఈసినిమాను నిర్మిస్తుంది. ఈసినిమా తోపాటు సిద్దు, నీరజా కోన డైరెక్షన్ లో తెలుసు కదా అనే సినిమాను కూడా చేస్తున్నాడు.రాశి ఖన్నా ,శ్రీనిధి శెట్టి హీరోయిన్లు గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.ఈరెండు కూడా ఈ ఏడాదే థియేటర్లోకి వచ్చే ఛాన్స్ వుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =