ఓటీటీలోకి వచ్చేసిన సైరన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Jayam Ravi, Keerthy Suresh Starrer Siren Streaming in Disney+ Hotstar Now

కోలీవుడ్ స్టార్ హీరో జ‌యం ర‌వి క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరన్’. కథానాయికలుగా స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ తొలిసారి కలిసి నటించడం విశేషం. తమిళంలో క్రైమ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని హోమ్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై సుజాత విజ‌య్ కుమార్ నిర్మించారు. ‘అభిమ‌న్యుడు’, ‘విశ్వాసం’, ‘హీరో’ వంటి ప‌లు చిత్రాల‌కు రైట‌ర్‌గా పనిచేసిన ఆంటోని భాగ్య‌రాజ్ ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని, యోగి బాబు, కౌశిక్ మెహతా, తులసి తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళనాట ఫిబ్రవరి 16న విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 23న ‘సైరన్’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్‌ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో అందుబాటులో ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =