బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ అజిత్ , హుమా ఖురేషి జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “వాలిమై “తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కారణంగా నిలిచిపోయిన “వాలిమై “మూవీ షూటింగ్ 8నెలల తరువాత హైదరాబాద్ లో పునః ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం అజిత్ పై బైక్ ఛేజింగ్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. హీరో అజిత్ బైక్ రేసర్ కావడంతో డూప్ లేకుండానే ఆ స్టంట్ సన్నివేశాలలో నటిస్తున్నారు. బైక్ స్టంట్ లో పాల్గొంటున్న హీరో అజిత్ కు ప్రమాదం జరిగి కాళ్ళకు , చేతులకు స్వల్ప గాయాలు అయ్యాయని , ప్రస్తుతం హైదరాబాద్ లోనే అజిత్ చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. హెచ్ వినోత్ , అజిత్ కాంబినేషన్ లో రూపొందిన “నెర్కొండ పార్వై ” మూవీ ఘనవిజయం సాధించింది. “వాలిమై “మూవీ పై అభిమానులతో పాటు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: