బిగ్ బాస్ 4- నిన్న ఎపిసోడ్ లో కూడా నామినేషన్ ప్రక్రియనే జరిగింది మొత్తం. మొన్న ఎపిసోడ్ లో ముగ్గురు నామినేషన్ చూపించగా నిన్న ఎపిసోడ్ లో మిగిలిన హౌస్ మేట్స్ నామినేషన్ ప్రక్రియను చూపించారు. ఎపిసోడ్ స్టార్టింగే అభిజిత్ నామినేషన్.. అభి అవినాష్ ను అమ్మ రాజశేఖర్ ను చేసాడు. ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్ కు అభికి పెద్ద అర్గ్యూమెంటే జరిగింది. ఎదుటివారిని మాట్లాడనివ్వరు అని చెప్పి అమ్మ రాజశేఖర్ కు రీజన్ చెప్పాడు. దానితో అసహనానికి గురైన అమ్మరాజశేఖర్ అభికి మాట్లాడే చాన్సివ్వకుండా ఆగ్రహం వ్యక్తం చేసాడు. అందరూ నా జీవితాన్ని అవమానపరుస్తున్నారని ఆవేశంతో ఊగిపోయాడు. ఈ ఇద్దరి అర్గ్యూమెంట్ లో అవినాష్ రాగా అభి సపోర్ట్ కోసం హారిక వచ్చింది. అప్పటికే కోపంతో ఉన్నమాస్టర్ ఆవేశంలో హారికను నోరు ముయ్ అంటూ నోరు జారాడు. దానితో ఇంకా హీట్ అర్గ్యూమెంట్ జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ తర్వాత హారిక అవినాష్, అమ్మ రాజశేఖర్‌ను, లాస్య అవినాష్, మోనాల్‌ను, మోనాల్.. సోహైల్, లాస్యను, అమ్మ రాజశేఖర్.. అభిజిత్, అఖిల్‌ను, మెహబూబ్.. హారిక, అవినాష్‌ను నామినేట్ చేశారు. ఇక అఖిల్ మోనాల్ ను నామినేట్ చేయడంతో హౌస్ మేట్స్ అందరూ షాకయ్యారు. ఇక ఆ తర్వాత మోనాల్ ను అమ్మ రాజశేఖర్ ఓదార్చాడు. నీ గేమ్ నువ్వు ఆడు అని మొదటి నుంచే చెప్తున్నా, ఇక నుంచి నీకు నేను సపోర్ట్‌గా ఉంటా అని మోనాల్‌కు హామీ ఇచ్చాడు. అబ్బాయి- అమ్మాయి ఫ్రెండ్‌షిప్ అంటే ఫ్రెండ్స్ కారు. కొంచెం మోర్ కావాలి. అదే ప్రాబ్లమ్ అని పేర్కొంది. మనుషులను తప్పుగా అంచనా వేశానని బాధపడింది. తాను ఒంటరినంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఫైనల్ మోనాల్, అభిజిత్, హారిక, అవినాష్, అమ్మ రాజశేఖర్ నామినేషన్‌లో నిలిచారు.
ఇక నామినేషన్ ప్రక్రియ అయిపోయింది అని రిలాక్స్ అవుతున్న హౌస్ మేట్స్ కు బిగ్ బాస్ ట్విస్ట్ అయితారు. “ముఖం జాగ్రత్త” అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా నామినేట్ అయిన వాళ్లు టీ స్టాండ్ మీద ముఖం పెట్టాలి. ఎండ్ బజర్‌కు ఎవరి తల స్టాండ్ మీద ఉంటే వారు నామినేషన్ నుంచి సేఫ్ అని అన్నాడు. ఇక టాస్క్‌లో భాగంగా మిగతా ఇంటిసభ్యులు నామినేట్ అయినవాళ్లను ఐస్ గడ్డలు, నీళ్లు, గడ్డి, మట్టి ఉపయోగిస్తూ నానారకాలుగా హింసించారు. కానీ ఎండ్ బజర్ మోగేసరికి టీ స్టాండ్ మీద మోనాల్, అవినాష్, అమ్మ రాజశేఖర్ స్టడీగా ఉన్నారు. దీంతో ఒక్కరి కన్నా ఎక్కువ మంది ఉన్న కారణంగా ఎవరికీ ఇమ్యూనిటీ లభించలేదు.
ఇక టాస్క్ అయిపోయిన తర్వాత అవినాష్ బాధపడ్డాడు. ఎన్నో అవమానాలు పడి వచ్చాను. మళ్లీ ఆ షోలోకి తీసుకోమని చెప్పారు. అవన్నీ గుర్తొచ్చాయని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ తనలాగే ఇక్కడ అందరూ స్ట్రాంగ్‌గా ఆడుతున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. మరోవైపు అఖిల్ చేసిన మోసానికి మోనాల్ కుంగిపోయింది. నేను హర్ట్ అయ్యాను అఖిల్, నువ్వు నన్ను నమ్మనందుకు బాధపడుతున్నానని కంటతడి పెట్టింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: