జూనియర్ ‘చిరంజీవి సర్జా’ వచ్చేశాడు

Late Actor Chiranjeevi Sarja Wife Meghana Sarja Gives Birth To Baby Boy

ఈ 2020 లో ఎంతోమంది సినీ సెలబ్రిటీస్ మృతిచెందిన సంగతి చూశాం. కొంతమంది కరోనా వల్ల మృతి చెందితే కొంతమంది సహజంగా మరణించారు. కన్నడ యంగ్ హీరో, ‘యాక్షన్‌ కింగ్‌’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్‌ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా కూడా జూన్ లో మరణించిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతి చెందారు. చిరంజీవి స‌ర్జా 2018 మే 2న మేఘ‌నా రాజ్‌ను వివాహ‌మాడారు. పెళ్ళైన రెండేళ్లకే ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మేఘ‌నా రాజ్ పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చింది. ఈ విషయాన్ని చిరంజీవి సార్జా సోద‌రుడు ధ్రువ సార్జా ఇన్ స్టాగ్రామ్ లో తెలియచేసాడు. ‘పండంటి చిన్నారి పుట్టాడు..జై హ‌నుమాన్ ‘ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. దీనితో జూనియ‌‌ర్ చిరు వ‌స్తున్నాడంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవి ఫొటో ముందు అత‌ని కొడుకును చూపిస్తున్న దృశ్యాలు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

 

 

View this post on Instagram

 

Junior chiru is comming ❤❤🥰🥰🥳🥳🥳🥳🥳

A post shared by DS_BOSS💪😎🔥 (@_action_prince_fc) on

 

 

View this post on Instagram

 

Ayyyyoo 🙈🙈🙈🥳🥳🥰🥰😘😘😘💋💋💋💋cuteness overload 🥰🥰😍😍❤❤

A post shared by DS_BOSS💪😎🔥 (@_action_prince_fc) on

కాగా మొదట అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన చిరంజీవి సర్జా..ఆ తర్వాత నటుడిగా మారి 2009లో ‘వాయుపుత్ర’ అనే చిత్రంతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత సర్జా ‘చిర్రు’, ‘చంద్రలేఖ’, ‘ఆటగర’, ‘భార్జరి’, ‘సీజర్’, ‘అమ్మ ఐ లవ్ యు’, ‘సింగా’, త‌దిత‌ర సినిమాల్లో నటించారు. ఆయన ఆఖరి సినిమా ‘శివార్జున’. తన కెరీర్‌ మొత్తంలో 19 సినిమాలు చేస్తే అందులో 14 చిత్రాలు రీమేక్‌లే కావడం గమనార్హం. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అందులో ఒక సినిమాకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతుండగా, మూడు సినిమాలు షూటింగ్ దశల్లో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =