కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజు గా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్నాడు. సెప్టెంబర్ 21న హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వరల్డ్ ఆఫ్ బస్తీ బాలరాజు పేరుతో పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా తిరిగి ఈరోజు షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు చిత్రయూనిట్. బ్యాక్ టూ సెట్స్ అంటూ ట్వీట్ చేసాడు. కరోనా నిబంధనలతో షూట్ చేస్తున్నట్టు వీడియో కూడా పోస్ట్ చేశారు. ఈ షూటింగ్ లో లావణ్య కూడా జాయిన్ అయింది. తను కూడా మాస్క్ తో షూట్ లో అడుగుపెట్టింది.
#BasthiBalaraju back on sets 💪🏻😎
#chaavukaburuchallaga https://t.co/xXSQlwQLAh— Kartikeya Gummakonda (@ActorKartikeya) October 21, 2020
కాగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: