చియాన్ విక్రమ్ పై శ్రీనిధి శెట్టి ప్రశంసలు

Cobra Movie Actress Srinidhi Shetty Applauds Chiyaan Vikram

సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ “కోబ్రా ” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “కన్నడ మూవీ ఫేమ్ శ్రీ నిధిశెట్టి కథానాయిక. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , దర్శకుడు కె ఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు భాషల మూవీస్ లో బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీనిధి మాట్లాడుతూ .. “కోబ్రా ” మూవీ లో నటించే ముందు నెర్వస్ గా ఫీల్ అయ్యాననీ , అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉందనీ , నటించడంలో ఇన్ స్పైర్ చేస్తున్న హీరో విక్రమ్ ఒక లెజెండ్ అనీ విక్రమ్ పై ప్రశంసలు కురిపించారు. “కోబ్రా ” మూవీ లో తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన నిర్మాత , దర్శకులకు థ్యాంక్స్ చెబుతూ “కోబ్రా ” మూవీ సెట్ లో తాను , దర్శకుడు , విక్రమ్ ఉన్న ఫొటో ను శ్రీనిధి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కోబ్రా ” మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + fifteen =