కేవలం సినిమాల్లో మెసేజ్ లు ఇవ్వడమే కాదు.. సమాజ సేవ చేయడంలో కూడా మన హీరోలు ఎప్పుడూ ముందుంటారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా మన హీరోలు తాము చేసే పనుల ద్వారా హీరోలనిపించుకుంటారు. ఇప్పుడు మరో హీరో కూడా తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఆ హీరో ఎవరో కాదు మెగా హీరో సాయితేజ్. ఇంతకీ ఏం మాట నిలబెట్టుకున్నాడు అనుకుంటున్నారు కదా. అసలు సంగతేంటంటే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2019లో తన జన్మదినోత్సవం సందర్భంగా సాయితేజ్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. విజయవాడలోని `అమ్మ ప్రేమ ఆదరణ సేవ` వృద్ధాశ్రమాన్ని అవసరమయ్యే ఖర్చులను తాను భరిస్తానని చెప్పాడు. విజయవాడలోని ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులు తనను సంప్రదించారని, అసంపూర్తిగా ఉన్న తమ బిల్డింగ్ నిర్మాణానికి సహాయం చేయాల్సిందిగా కోరారని తెలిపాడు. తాను దానికి అంగీకరించానని, మెగా ఫ్యాన్స్ కూడా చేతనైనంత సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. అయితే ఇప్పుడు ఆ భవన నిర్మాణం పూర్తి అయినట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇపుడు బయటకు వచ్చాయి. దీనితో మెగా హీరోపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
కాగా సాయి తేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈసినిమాలో `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు దేవా కట్టా దర్శకత్వంలో.. కార్తీక్ దండు దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: