మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అందాదూన్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదనుకోండి. ఇక అందాదూన్ సినిమా చూసిన ఎవరికైన ఈ సినిమాలో టబు పాత్ర ఎంత కీలకమో తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పాత్రలో తెలుగులో ఎవరు నటిస్తారబ్బా అన్న దానిపై గతకొద్దిరోజులుగా పలువురి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల శ్రీయా పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు అంత ఇంపార్టెంట్ రోల్ లో ఎవరు నటిస్తున్నారో క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమాను నిర్మిస్తున్న శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ అధికారికంగా ప్రకటించారు. టబు స్థానంలో మిల్కీబ్యూటీ తమన్నా నటించనుండగా..రాధికా ఆప్టే స్థానంలో నభా నటేశ్ నటిస్తున్నట్టు కన్ఫామ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సాగర్ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేస్తానన్నారు.
మరి ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన ‘అందాదూన్’ సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను ఆయుష్మాన్ ఖురానాకు నేషనల్ అవార్డ్ దక్కింది. టబు విమర్శకుల ప్రశంసలతో పాటు ఫిలిం ఫేర్ అవార్డ్ ఇంకా పలు అవార్డ్స్ ను సొంతం చేసుకుంది. మరి అంత బోల్డ్ క్యారెక్టర్ లో మిల్కీ బ్యూటీ ఎంత వరకూ మెప్పించగలదో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: