ఫైనల్లీ మహాసముద్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ సినిమాపై గతకొద్ది రోజులుగా వార్తలు వస్తూనే వున్నాయి. ఇక ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. అయితే ఇంత వరకూ అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ రోజు ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. శర్వానంద్ హీరోగా, అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రకటించింది. ‘ప్రస్థానం’, ‘గమ్యం’ చిత్రాల తర్వాత శర్వానంద్ చిరకాలం గుర్తుండిపోయే ఉద్వేగభరితమైన, బలమైన పాత్రను చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో ఛాలెంజింగ్ రోల్‌ను చేయబోతున్నందుకు శర్వానంద్ అమితోత్సాహంతో ఉన్నారు అని ట్వీట్ లో పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Announcement 📢
We are Happy to announce our next project with our Versatile actor @ImSharwanand. It’s a Telugu-Tamil bilingual project titled #MahaSamudram, directed by Ajay Bhupathi under AK Entertainments. @DirAjayBhupathi @AKentsOfficial@AnilSunkara1 pic.twitter.com/cUGtC2GhDp
— AK Entertainments (@AKentsOfficial) September 7, 2020
కాగా అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమా ఎంత సన్సేషన్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలి చిత్రం ఆర్ఎక్స్ 100 సినిమాతోనే పెద్ద సక్సెస్ కొట్టాడు అరుణ్ భూపతి. వీరూ పోట్ల, రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. తనలోని క్రియేటివిటీకి మరింత పదును పెట్టి ఓ నిజ జీవిత కథ ఆధారంగా స్టోరీ తెరకెక్కించి మంచి విజయం సాధించాడు. లవ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లు సొంత చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి ఇంతవరకూ కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. మరి ఈ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో చూడాలి.
సూపర్ స్టార్ మహేష్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ బ్లాక్ బస్టర్‌ను నిర్మించిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఇప్పుడు ‘మహాసముద్రం’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని నిర్మిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: