‘క్రాక్’ సాంగ్స్ అప్ డేట్ ఇచ్చిన థమన్

Music Director SS Thaman Gives An Interesting Update About Ravi Teja krack Movie Songs On Twitter

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇప్పటీకే విడుదల చేసిన ర‌వితేజ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. రెండు రోజుల క్రితమే ఈ సినిమా నుండి రవితేజ కొత్త స్టిల్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అంతే కాదు ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో చివరి షెడ్యూల్ ను జరపడానికి ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆల్బమ్ గురించి తాజాగా తన ట్విట్టర్ ద్వారా ఒక అప్ డేట్ ఇచ్చాడు థమన్. నా అభిమానులందరూ క్రాక్ సాంగ్స్ ను అడుగుతున్నారు.. ఈరోజు కంపొజిషన్ ఫైనలైజ్ చేయడం స్టార్ట్ చేశాం.. అని తన ట్వీట్ లో తెలిపాడు.

 

కాగా ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమాతో శ్రుతి హాస‌న్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను… సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =