క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-రకుల్ హీరో హీరోయిన్లుగా సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. వెంటనే షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్న ఈ సినిమాను ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే రకుల్ – వైష్ణవ్ తేజ్ సినిమా మొదలు కావడంతో క్రిష్-పవన్ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదంటున్నారు. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. లేకపోతే మే లోనే ఈ సినిమా రిలీజ్ అయి ఉండేది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ముందు అవ్వాలని.. అది అవ్వాలంటే కనీసం నాలుగు నెలలైనా టైం పడుతుందని.. వకీల్ సాబ్ సినిమా షూట్ అయిపోయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు.
కాగా పిరియాడిక్ మూవీ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నాడు పవన్ కళ్యాణ్. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కీరవాణి సంగీతం అందించనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: