మాస్ మహారాజా రవితేజ ప్రతీ సినిమాలో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ నటించిన మూవీస్ జయాపజయాలతో సంబంధంలేకుండా రవితేజ పై క్రేజ్ ఉన్న ప్రేక్షకులు ఆయన నటనను ఆస్వాదిస్తారు. రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తోపాటు రవితేజ మరికొన్ని మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
A స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మాతగా, రవితేజ హీరోగా , సక్సెస్ ఫుల్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో రాశీఖన్నా , నిధి అగర్వాల్ కథానాయికలుగా ఎంపిక అయ్యారని , మూవీ టైటిల్ “ఖిలాడీ ” పరిశీలనలో ఉందని సమాచారం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ మూవీ కి “ఖిలాడీ ” వంటి మాస్ టైటిల్ యాప్ట్ అనడంలో సందేహం లేదు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: