సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర తెలుగు మూవీస్ తో పాటు తమిళ మూవీస్ లో కూడా నటించారు. సూపర్ హిట్ “నేను లోకల్ ” మూవీ తో గుర్తింపు పొందిన నవీన్ చంద్ర సూపర్ హిట్ “అరవింద సమేత వీర రాఘవ” మూవీ లో బాల్ రెడ్డి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హీరో అనే కాకుండా నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను నవీన్ చంద్ర ఎంపిక చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నవీన్ చంద్ర హీరోగా రూపొందిన “భానుమతి రామకృష్ణ ” మూవీ OTT లో రిలీజ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది. ట్యాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర కు ఇప్పడు బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న మూవీ లో ఆఫర్ వచ్చినట్టు సమాచారం. మాస్ మసాలా మూవీస్ దర్శకుడు బోయపాటి శ్రీను , బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న “#NBK106 ” మూవీ లో ఒక కీలక పాత్ర కు నవీన్ చంద్ర ఎంపిక అయ్యారని, ఈ మూవీ లో నవీన్ చంద్ర యంగ్ ఎమ్మెల్యే గా నటించనున్నారని , ఆ క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్ తో కూడుకున్నదని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: