తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు వుంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇక ఇప్పుడు ఆయన వారసులుగా విష్ణు, మనోజ్ తెలుగు సినీ పరిశ్రమలో హీరోలుగా తమకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక మోహన్ బాబు గారాల పట్టి లక్ష్మీ కూడా అడపా దడపా సినిమాలు చేస్తూనే బుల్లితెరపై తన స్పెషల్ షోస్ తో పాపులారిటీ సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ రోజు మంచు విష్ణు ముద్దుల కూతురు ఐరా విద్య మొదటి పుట్టిన రోజు వేడుకలని మంచు ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పార్టీలో సందడి చేసినట్టు తెలుస్తుంది. మంచు లక్ష్మీ, మనోజ్, మోహన్ బాబు ఆయన సతీమణి తదితరులు వేడుకలో పాల్గొన్నారు. అంతేకాదు ఈ వేడుకలో మంచు ఫ్యామిలీ అంతా ఒకే డ్రెస్ కోడ్ పాటించింది. అందమైన డ్రెస్‌లలో మంచు కుటుంబం ఫోటో షూట్ నిర్వహించారు. ఇక ఈ ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఐరా నేటితో ఏడాది పూర్తి చేసుకుంది, ఇదే నా పరివారం అంటూ ఫోటోలని మంచు విష్ణు తన ట్వీట్లో పేర్కొన్నారు.
My Ayra turns one today! #AyraManchu #AyraManchuBirthday My Tribe! #happiness #blessed pic.twitter.com/w2FOFkLYm2
— Vishnu Manchu (@iVishnuManchu) August 9, 2020
కాగా హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఈసినిమాలో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటిస్తుండగా..నవదీప్, నవీన్ చంద్ర, రుహాని సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో విష్ణు అర్జున్ పాత్రలో నటిస్తుండగా.. కాజల్ అను పాత్రలో నటిస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: