మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కోడి రామ కృష్ణ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన ఫాంటసీ డ్రామా “అరుంధతి ” మూవీ 2009 సంవత్సరం జనవరి 16 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనుష్క సినీ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ మూవీ లో VFX , సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్స్ గా నిలిచాయి. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ 10 నంది , 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అరుంధతి గా అనుష్క , పశుపతి గా సోను సూద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు “అరుంధతి ” మూవీ హిందీ భాషలో రీమేక్ కానుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మూవీ హిందీ రైట్స్ ను స్వంతం చేసుకున్నారు. అల్లు అరవింద్ తో పాటు ఫాంటమ్ ఫిల్మ్స్ & బ్రాట్ ఫిల్మ్స్ మధు మంతెన బాలీవుడ్ లో రూపొందించనున్నారు. ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే అరుంధతి గా నటించనున్నారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన బ్లాక్ బస్టర్ “భాగమతి ” మూవీ “దుర్గావతి “టైటిల్ తో బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: