ఒకప్పుడు పాతతరం హీరోయిన్స్ తమ వాయిస్ తోనే సినిమాలు చేసేవాళ్ళు. డబ్బింగ్ లు అలాంటివి అప్పట్లో లేవు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఎలా అయినా పనులు జరిగిపోతున్నాయి. కానీ అప్పట్లో షూటింగ్ స్పాట్లోనే డైలాగ్స్ ను రికార్డు చేసుకోవాల్సి వచ్చేది. ఒకవేళ తమిళ్, కన్నడం, మలయాళం నుండి తెచ్చుకున్నా సరే ఎవరి పాత్రలకు వాళ్లే వాయిస్ ఇచ్చుకునేవాళ్ళు. ఇక మధ్య తరంలో అయితే హీరోయిన్స్ తమ గొంతును వాడటమే మానేశారు. అందరికి డబ్బింగ్ ఆర్టిస్టులు గొంతు అరువు ఇవ్వడమే. అందుకే వారికి ఇప్పటికీ తెలుగు సరిగా మాట్లాడటానికి రాదు. త్రిష, కాజల్, శ్రియ,ఇలియానా దాదాపు 15 ఏళ్ళ పైన అవుతున్న సరిగా తెలుగు మాట్లాడకపోవడానికి కారణం కూడా అదే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ ఇప్పుడు హీరోయిన్స్ మాత్రం కాస్త తెలివిగానే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రెండు మూడు చిత్రాలు చేయగానే తెలుగు నేర్చేసుకుంటున్న హీరోయిన్స్ తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్తాం అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటేనే నెగ్గుకు రాగలం అనుకుంటూ హీరోయిన్స్ ఓన్ డబ్బింగ్‌కు రెడీ కాబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ లో వున్న హీరోయిన్స్ అందరు తమ గొంతుకే పని చెప్తున్నారు.
సాయి పల్లవి, నిత్యామీనన్‌లు మొదటి నుండి సొంతంగానే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. పూజా హెగ్డే కూడా అరవింద సమేత మూవీ నుండి తనే డబ్బింగ్ చెప్పుకుంటుంది. తొలిప్రేమ సినిమాతో రాశి ఖన్నా, మహానటి సినిమాతో కీర్తి సురేష్ తమ సొంత గొంతుతో అదరగొట్టారు. ఇక రష్మిక అయితే ఇప్పటికే మూడు సినిమాల దాకా డబ్బింగ్ చెప్పేసుకుంది. మరి ఎంతమంది హీరోయిన్స్ తమ సొంత వాయిస్ ను వాడినా.. మనం ఒక వాయిస్ కు కనెక్ట్ అవుతాం కదా. అలా ఇంతమంది యంగ్ హీరోయిన్స్ తమ సొంత వాయిస్ తో డబ్బింగ్ చెప్పగా మీరు మెచ్చిన వాయిస్ ఏంటో మీ ఓటు ద్వారా తెలపండి.
[totalpoll id=”46482″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: