సక్సెస్ ఫుల్ “మున్నా మైఖేల్ ” మూవీ తో బాలీవుడ్ లో సినీకెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్ “సవ్యసాచి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి “Mr మజ్ను : మూవీ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తో నిధి గుర్తింపు పొంది పలు అవకాశాలను అందుకుంటున్నారు. “భూమి “మూవీ తో కోలీవుడ్ కు , “జేమ్స్ ” మూవీ తో శాండల్ వుడ్ కు నిధి పరిచయం అవుతున్నారు. అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న తెలుగు మూవీ లో నిధి కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయం లో తన కుటుంబ సభ్యులతో 4 నెలలుగా బెంగుళూరు లో ఉంటున్న నిధి అగర్వాల్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో రెండు లేదా మూడు రోజులు తన స్వంత ఇంటిలో ఉండేదానినని , లాక్ డౌన్ సమయంలో తన సిస్టర్ , పేరెంట్స్ తో ఎంజాయ్ చేస్తున్నానని, పెట్ డాగ్స్ తో ఆడుకుంటూ , ఆన్ లైన్ యాక్టింగ్ క్లాసెస్ కు అటెండ్ అవుతూ , యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్నానని, కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో బయటకు వెళ్ళడం రిస్క్ తో కూడుకున్నదని , వ్యాక్సిన్ వచ్చేవరకూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని, పెట్ డాగ్స్ ను వాకింగ్ కు తీసుకెళ్ళడానికి మాత్రమే మాస్క్ , గ్లోవ్స్ , శానిటైజర్ లతో బయటకు వెళుతున్నానని, ఫ్యాషన్ గా ఉండడం కంటే సేఫ్టీ గా ఉండడం ముఖ్యమని, ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో పెట్స్ స్ట్రెస్ బస్టర్స్ గా ఉపయోగపడతాయని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: