‘RRR’ పై ఎలాంటి అనుమానం అవసరంలేదు..!

RRR Going To Be Another Visual Feast To Audience Says Tollywood Ace Writer Sai Madhav Burra

రాజమౌళి లాంటి డైరెక్టర్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతో సినిమా అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ప్రకటన ఎప్పుడు చేశారో అప్పటినుండి అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా?చూద్దామా? అని ఎదురుచూస్తున్నారు. ఇక ఎదురుచూపులకు తగ్గట్టే ఈ సినిమా రిలీజ్ కూడా వెనక్కి వెళ్తుంది. మరి ఇలాంటి సినిమాకు డైరెక్టర్ అంటే రాజమౌళి కాబట్టి డౌట్ లేదు. మరి ఇద్దరు స్టార్ హీరోలకు డైలాగ్స్ రాయడం అంటే కత్తిమీద సాము లాంటిదే. కాస్త అటూ ఇటూ అయితే మాత్రం ఫ్యాన్స్ చేసే రచ్చ అలా ఇలా ఉండదు. ఇక ఈ నేపథ్యంలో ఈ సినిమాకు డైలాగ్స్ రాసిన బుర్రా సాయిమాధవ్ ఈ సినిమా గురించి.. పాత్రల నిడివి గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఎన్నో హిట్ చిత్రాల‌కి డైలాగ్ రైట‌ర్‌గా ప‌ని చేసిన సాయి మాధ‌వ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకి ప‌ని చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిమాధవ్.. ఒక‌రు ఎక్కువ‌, ఒక‌రు త‌క్కువ అని ఏంలేదు..ఇద్ద‌రికీ సమానంగా డైలాగ్స్ రాశానని.. ఇద్ద‌రి పాత్ర‌ల నిడివి స‌మానంగా ఉంటుంద‌ని బుర్రా అన్నారు. అభిమానులు ఇలాంటి విష‌యాల‌లో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవ‌ద్ద‌ని… ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కి మించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. మరి మనం కూడా ఆ అనుభూతి ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయనున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 14 =