రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా వుండడన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఫేస్‌బుక్‌లో మాత్రమే ఉండేది. అది కూడా ఏదో నామ మాత్రం అన్నట్టుగానే ఉండేవాడు. ఇక ఇటీవలే ట్విట్టర్లోకి అడుగు పెట్టాడు. ట్విట్టర్ కూడా అదే పరిస్థితి. చాలా రేర్ గా అప్ డేట్స్ ఇస్తుంటాడు. అయితే చరణ్ తాజాగా చేసిన ట్వీట్ మాత్రం వైరల్ అవ్వడమే కాకుండా ఆలోచింపచేస్తుంది. ఇంతకీ చరణ్ పెట్టిన ట్వీట్ ఏంటంటే.. ‘‘హింస లేదా అహింస.. మార్గం ఏదైనా, ప్రతీకారం కోరుకుంటే మనం ఉన్న చోట స్తంభించిపోతాం తప్ప ఎదుగుదల ఉండదు.’’ అని రామ్ చరణ్ ట్వీట్ చేసి ఆయన నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలోని ఓ స్టిల్‌ను, మరో క్లోజప్ స్టిల్‌ను పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ మారింది. ఎవరూ ఊహించని విధంగా ఆయన ట్వీట్ చేయడం చేయడంతో.. దేనిని ఉద్దేశించి చరణ్ ఈ ట్వీట్ పెట్టాడబ్బా అని ఆలోచిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
When u seek revenge violent or non-violent, we are just revolving ,not evolving.
హింస లేదా అహింస.. మార్గం ఏదైనా, ప్రతీకారం కోరుకుంటే మనం ఉన్న చోట స్తంభించిపోతాం తప్ప ఎదుగుదల ఉండదు.
-Edith Eva Eger: The Choice pic.twitter.com/V1bivgVtnX
— Ram Charan (@AlwaysRamCharan) July 5, 2020
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ చేయబోయే సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ప్రస్తుతం షూటింగ్ లు లేవు కాబట్టి లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: