మహేష్ ను వదిలి ఉండలేనని అప్పుడే అర్థమైంది..!

Namrata Shirodkar Opens Up About Her Love Story With Mahesh Babu

లాక్ డౌన్ లో నమ్రత సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు, గౌతమ్, సితారలకు సంబంధించిన వీడియోస్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది. ఇక ఎప్పుడూ వీడియోలు పంచుకునే నమ్రత ఇన్‌స్టాలో నిర్వహించిన ‘ఆస్క్‌ మీ యువర్‌ క్వశ్చన్’ అంటూ అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. మరి అభిమానులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు.. నమ్రత ఎలాంటి సమాధానాలు చెప్పిందో చూద్దాం..

మహేశ్‌బాబు నటించిన చిత్రాల్లో మీకే బాగా నచ్చేవి?
ఒక్కడు, పోకిరి, దూకుడు, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, భరత్‌ అనే నేను

త్వరలోనే మహేష్ పుట్టినరోజు వస్తుంది. మహేష్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్లాన్ ఏంటి..?
ఇది లాక్ డౌన్ టైమ్. ఎలాంటి ప్లానింగ్స్ లేవు. ఎలాంటి ప్లానింగ్ లేకపోవడమే బెస్ట్ ప్లానింగ్

మీది లవ్ మ్యారేజ్ కదా. మహేష్ ను ప్రేమిస్తున్నట్టు ఎప్పుడు తెలిసింది?
వంశీ సినిమా కోసం 52 రోజుల లాంగ్ షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరిగింది. ఆ సినిమా షూటింగ్ లాస్ట్ డే మహేష్ ని విడిచి ఉండలేననే ఫీలింగ్ వచ్చింది. అప్పుడే ప్రేమలో పడినట్టు అర్థమైంది.

మహేష్ సినిమాల విషయాల్లో మీరు ఇన్వాల్వ్‌ అవుతారా?
తన సినిమా విషయాల్లో అస్సలు తలదూర్చను

మహేష్‌ నిక్‌నేమ్‌?
నాని

మీ ఫేవరెట్‌‌ హీరో ఎవరు?
ఇంకెవరు మహేష్ బాబు

మీ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌?
మంచిగా భోజనం చేయడం, నిద్ర పోవడం, వ్యాయామం చేయడం

మహేష్-పూరీ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా?
అది కాలమే చెప్పాలి

మహేష్ మీరు ఒకే సినిమాలో కలిసి మళ్లీ నటించే అవకాశం ఉందా?
అది మళ్లీ సాధ్యం కాకపోవచ్చని నాకనిపిస్తోంది.

సితార సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా?
ఇప్పుడే ఏం చెప్పలేం. ప్రస్తుతం తను తన యూట్యూబ్‌ ఛానల్‌ వీడియోలతో చాలా సంతోషం ఉంది

సితార-గౌతమ్ తెలుగు మాట్లాడతారా?
తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ చక్కగా మాట్లాడతారు

మీకు ఇష్టమైన క్రికెటర్లు ఎవరు?
ఎంఎస్‌ ధోని, విరాట్‌ కోహ్లి

మీ లైఫ్‌లో బెస్ట్‌ మూమెంట్‌?
నా పెళ్లి రోజు. ఇద్దరు పిల్లలకు తల్లినైన రోజు.

మీరు బాగా చేసే ఒక వంటకం?
(నవ్వుతూ) మ్యాగీ న్యూడిల్స్‌

ఒకవేళ మహేష్ వంట చేస్తానంటే మీరు ఏం వండమని చెబుతారు?
మహేష్ ఏం వండుతాడా? అని నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను.

మహేష్ లో మీకు నచ్చిన విషయం?
మహేష్ వ్యక్తిత్వం

సర్కార్ వారి పాట కథ ఎలా ఉంటుంది?
ఇప్పుడే చెప్పలేను కానీ సినిమాలో ప్రతి ఎలిమెంట్ ను అంతా బాగా ఎంజాయ్ చేస్తారు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here