‘టిక్ టాక్’ నిషేధంపై యంగ్ హీరోల ఆసక్తికర సంభాషణ..!

Tollywood Heroes Reacts To Indian Government Decision To Ban China Apps

భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో చైనా యాప్స్ ను భారత్ బ్యాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. చైనా యాప్స్ అనేక సెక్యూరిటీ సమస్యలకు కారణం అవుతాయని భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టిక్ టాక్ యాప్ ను కూడా భరత్ బ్యాన్ చేసింది. ఇక ఈ టిక్ టాక్ బ్యాన్ పై ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోలు సోషల్ మీడియా వేదికగా జరిపిన సంభాషణ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ ఇద్దరు హీరోలు ఎవరో కాదు.. నిఖిల్ ఇంకా సందీప్ కిషన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టిక్ టాక్’ ని బ్యాన్ చేయడంపై నిఖిల్ ట్వీట్ చేస్తూ.. టిక్ టాక్ ని బ్యాన్ చేయడం సరికాదని.. వారు మన దేశాన్ని, మన జీవన విధానాన్ని, ప్రజాస్వామిక వ్యవస్థను వారు గౌరవించినంత కాలం..వారి యాప్స్ మనం బ్యాన్ చేయకూడదు అన్నారు. ఇక నిఖిల్ ట్వీట్ పై సందీప్ కిషన్ స్పందిస్తూ… ”నా ఇన్స్టెంట్ రియాక్షన్ కూడా అదే మామా.. కానీ ఈ యాప్స్ ని నిషేధించడం అనేది అవసరమైన బోల్డ్ మూవ్.. చైనా ప్రభుత్వం చేస్తున్నది దారుణం.. మనం ఉపాధిని కోల్పోతున్నాము. మన దృష్టిలో మంచిదే. కానీ జాతీయ భద్రత దృష్టిలో ఉంచుకుని చూస్తే అనుషంగిక నష్టంగా భావించవచ్చు..” అని ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనిపై నిఖిల్ మళ్లీ సమాధానంగా ”సరిగ్గా నా పాయింట్ అదే మామా … నువ్వు తప్పకుండా మళ్ళీ నా ట్వీట్ చదవాలి. దానిలోని వ్యంగ్యం హాలోతో ఈ హ్యాష్ ట్యాగ్ ను పెట్టాను” అని వివరణ ఇచ్చాడు. దీనికి ”సారీ.. అది నేను చూసుకోలేదు” అని సందీప్ రిప్లై ఇచ్చాడు. ఇక ఇప్పుడు వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

ఇక నిఖిల్ ప్రస్తుతం దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా చేయనున్నాడు. సందీప్ కిషన్ డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో A1 ఎక్స్ ప్రెస్ సినిమా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.