సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల రిలీజ్ కాస్త వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో నీ కన్ను నీలి సముద్రం అనే పాట ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ దక్కించుకుని యూ ట్యూబ్ ని షేక్ చేస్తోంది. దీనితో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం చిత్రయూనిట్ మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసే పనిలో పడ్డట్టు తెలుస్తుంది. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వినిపిస్తుంది. అదేంటంటే ఈ అన్ని పనులు అయిపోయిన తర్వాత మెగాస్టార్ చిరుకు స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారట.
కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: