ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు యూరప్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా… కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక లాక్ డౌన్ తీసేసినా విదేశాలు వెళ్లడం కష్టమే కాబట్టి ఇక్కడే షూట్ ను పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు తాను ఈ సినిమాలో నటించడానికి గల కారణం ఏంటో తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ ప్రభాస్ గురించి మాట్లాడుతూ… `ప్రభాస్ నటన అంటే నాకు చాలా ఇష్టం. అందువల్లే ఆయన సినిమాలో నటించేందుకు అంగీకరించాను. ప్రభాస్‌ది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం. తొలిరోజు సెట్‌లో అడుగుపెట్టినపుడు నన్ను సాదరంగా ఆహ్వానించాడు. మా ఇద్దరం ఫుడ్ గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్లమ`ని భాగ్యశ్రీ చెప్పింది.
కాగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి ‘ ఓ డియర్’ .. ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: