చిరు హర్ట్ .. ‘ఆచార్య’ ను ఆగష్ట్ కు వాయిదా..!

Megastar Chiranjeevi's Acharya To Be Postponed?
Megastar Chiranjeevi's Acharya To Be Postponed?

అదేంటి.. మెగాస్టార్ చిరంజీవి ఇంతకీ ఈ విషయంలో హర్ట్ అయ్యరబ్బా అనుకుంటున్నారా.. అసలుసంగతేంటంటే.. టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం మొన్న జరిగిన బాలయ్య వివాదం వలన చిరు బాగానే నోచుకున్నారట. షూటింగ్‌ల అనుమతుల కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభుత్వంతో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ చర్చలపై బాలకృష్ణ స్పందించి.. నన్ను ఈ మీటింగ్స్‌కు ఎవరూ పిలవలేదు.. అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. అంతేకాదు భూములు పంచుకుంటున్నారా అంటూ పలు సంచలన వ్యాఖ్యలే చేశారు. ఇక ఈ వివాదంపై పలువురు పలు రకాలుగా స్పందించినా.. చిరు మాత్రం హర్ట్ అయ్యాడట. అందుకే ఇకపై షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్‌కు సంబంధించి ప్రభుత్వం జరిపే చర్చలకు హాజరు కాకూడదనే నిర్ణయానికి వచ్చారనే వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తన సినిమా షూటింగ్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారట. అందరూ షూటింగ్ ఏర్పాట్లు చేసుకొని రెడీగా ఉన్నారు ఎప్పుడు అనుమతి వస్తే అప్పుడు మొదలు పెడదామని.. అయితే చిరు మాత్రం ఆగష్ట్ లో స్టార్ట్ చేయాలని నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. మరి చూద్దాం దీనిపై చిరు ఏమన్నా బహిరంగంగా క్లారిటీ ఇస్తారేమో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సిసిసి మనకోసం’ అనే సంస్థ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ ఛారిటీ ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అంతేకాదు ఎంతోమంది సెలబ్రిటీలు సైతం ఈ ఛారిటీకి తమవంతుగా ఆర్థిక సహాయం అందించారు.

కాగా కొరటాల శివ-చిరు కాంబినేషన్ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. ఇక ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ సినిమా చేయనున్నారు. సాహూ లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసిన సుజీత్ అయితే ఈ సినిమాను కరెక్ట్ గా తీయగలడని భావించి చిరు ఈ భాద్యతలు తనకి అప్పగించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నాడు సుజీత్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 5 =