“అలివేలు వెంకటరమణ ” మూవీ లో హీరోయిన్ రకుల్ ?

Director Teja Plans To Rope In Rakul Preet Singh To Play The Lead Opposite Gopichand In His Upcoming Movie Alimelu Manga Venkataramana

తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడు గా “అలివేలు వెంకటరమణ ” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా సాయి పల్లవి గానీ , రకుల్ ప్రీత్ ను గానీ ఎంపిక చేయాలని దర్శకుడు తేజ ప్లాన్ చేశారు. సాయి పల్లవి పలు మూవీస్ లో బిజీగా ఉండడంతో రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా ఎంపిక చేయడం బెటర్ అని తేజ భావిస్తున్నట్టు సమాచారం. ఇంతకు ముందు గోపీచంద్, రకుల్ జంటగా రూపొందిన “లౌక్యం “మూవీ ఘనవిజయం సాధించింది.

దర్శకుడు తేజ దర్శకత్వంలో రూపొందిన “జయం “, “నిజం ” మూవీస్ లో విలన్ గా నటించిన గోపీచంద్ “అలివేలు వెంకటరమణ ” మూవీ లో హీరోగా నటించడం విశేషం. హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్” మూవీ లో నటిస్తున్నారు. హిందీ మూవీస్ తో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం “ఇండియన్ 2″తమిళ మూవీ, యేలేటి చంద్ర శేఖర్ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న “చెక్ ” మూవీ లో నటిస్తున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here