ప్రభాస్ సినిమాకు ‘దీపికా’ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే..!

Bollywood Star Heroine Deepika Padukone Responds Positively To Act With Prabhas In His Upcoming Movie With Nag Ashwin
Bollywood Star Heroine Deepika Padukone Responds Positively To Act With Prabhas In His Upcoming Movie With Nag Ashwin

నాగ్ అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే రోజుకో వార్త తెరపైకి వస్తూనే వుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా నటించే అవకాశం ఉందని ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దానికితోడు నాగ్ అశ్విన్ తీసిన మహానటి సినిమాపై ఇటీవల సోషల్ మీడియాలో స్పందిస్తూ తప్పక చూడండి అని కూడా చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టయింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొదట ఈ సినిమా కోసం అలియా భట్ ను అనుకున్నా తాను వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్ల దీపికా ను సంప్రదించారట. అయితే ముందు కాస్త ఆలోచించిన దీపికా నాగ్ అశ్విన్ చెప్పిన కథ నచ్చడంతో పాటు.. ప్రభాస్ హీరో అందులోనూ పాన్ ఇండియా మూవీ కాబట్టి ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్టు సమాచారం. అధికారిక ప్రకటన రావడమే లేట్ అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

ఇక ఈ సినిమాలో విలన్ గా రానా చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. రానా అయితేనే ఆ పాత్రకు న్యాయం చేస్తాడని అశ్విన్ అనుకుంటున్నాడట. మరి చూద్దాం ఈ వార్తలలన్నిటిపై నాగ్ అశ్విన్ క్లారిటీ ఇస్తాడేమో.

కాగాప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here