రిలాక్స్ మూడ్ లో తమన్నా

Actress Tamannaah Gets In To Relax Mode

ప్రజల దైనందిక జీవితంలో కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ప్రజలు పలు కష్టనష్టా లకు గురిఅయ్యారు. లాక్ డౌన్ సమయంలో మూవీ షూటింగ్స్ నిలిచిపోయి , షూటింగ్స్ , ఓపెనింగ్స్, ఫోటో షూట్స్ వంటి వాటితో క్షణం తీరిక లేకుండా ఉండే సినీ సెలబ్రిటీస్ రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితం అయ్యారు. తమ తమ వ్యాపకాలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Wake me up when it’s all over 🐷🐷🐷

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

లాక్ డౌన్ సమయం లో స్టార్ హీరోయిన్ తమన్నా తన మాతృ భాష సింధీ నేర్చుకుంటున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవితంలో జరిగే విశేషాలను అభిమానులకు వెల్లడిస్తున్నారు. దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీ లో కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. రెండు బాలీవుడ్ మూవీస్ లో నటిస్తున్నారు. “వేక్ మీ అప్ వెన్ ఇట్స్ అల్ ఓవర్” అనే క్యాప్షన్ తో రిలాక్స్ మూడ్ లో ఉన్న తన ఫొటోస్ ను తమన్నా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here