సూప‌ర్ స్టార్‌ మహేష్ బాబు ప్రయోగాత్మక చిత్రం ‘నాని’కి 16 ఏళ్ళు

Super Star Mahesh Babu Science Fiction Movie Nani Completes 16 Years

ఈతరం కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తీరే వేరు. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలకూ పెద్దపీట వేస్తుంటాడీ టాలెంటెడ్ స్టార్. అలా.. మహేష్ నటించిన ప్రయోగాత్మక చిత్రాల్లో ‘నాని’ ఒకటి.

సైన్స్ ఫిక్ష‌న్ మూవీగా తెర‌కెక్కిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మహేష్‌కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ నటించింది. దేవయాని, ఐశ్వర్య, నాజర్, రఘువరన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, రవిబాబు, సంజయ్ స్వరూప్, సునీల్, మాస్టర్ ప్రధ్‌ ముఖ్య భూమికలు పోషించగా.. అంజలా ఝవేరి, కిరణ్ రాథోడ్, మెహ‌క్ టైటిల్ సాంగ్‌లో మెరిసారు. రమ్యకృష్ణ ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నువిందు చేసింది. అలాగే, ఈ సినిమా ప‌తాక స‌న్నివేశాల్లో మహేష్ డ్యూయల్ రోల్‌లో దర్శనమివ్వడం విశేషం.

టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.జె.సూర్య తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై మంజుల ఘట్టమనేని నిర్మించారు. తెలుగుతో పాటు తమిళంలో ‘న్యూ’ పేరుతో ఏకకాలంలో ఈ సినిమా రూపొందింది. మ‌హేష్, అమీషా పాత్ర‌ల్ని త‌మిళంలో ఎస్.జె.సూర్య, సిమ్రన్ పోషించ‌డం విశేషం.

స్వ‌రమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ వీనులవిందైన బాణీలు అందించగా వేటూరి సుందరరామమూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. వీటిలో “పెదవే పలికిన”, “వస్తా నీ వెనుకా” గీతాలు విశేషాద‌ర‌ణ పొంద‌గా.. “నాని వయసే”(టైటిల్ సాంగ్‌), “చక్కెర”, “స్పైడర్ మాన్”, “నాకు నువ్వు” పాట‌లు కూడా అలరించాయి. 2004 మే 14న విడుదలై మహేష్ అభిమానులతో పాటు ఓ వర్గం ప్రేక్షకులను అలరించిన ‘నాని’.. నేటితో 16 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here