కృష్ణమ్మ సెకండ్ సాంగ్ రిలీజ్

Satya Dev Krishnamma Movie second single out now

విభిన్నమైన కథలతో అలరించడంలో సత్యదేవ్ ఎప్పుడూ ముందుంటాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టీజ‌ర్‌తో పాటు ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ సెకండ్ సింగిల్ విడుద‌ల చేశారు. థీమ్ ఆఫ్ వెంజెన్స్ అనే పేరుతో విడుదల చేసిన ఈపాట రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నట్టు అర్థమవుతుంది. చూపుల్లో శూన్యం సుడిలో హృదయం పైపైనే మౌనం ఎదలో మథనం అంటూ సాగిన ఈ పాటను అనంత్ శ్రీరామ్‌ రాయగా.. కాలభైరవ కంపోజిషన్‌లో దిలీప్, కాలభైరవ ఆలపించారు.

ఇంకా ఈసినిమాలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలబైరవ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =