‘హ్యాపీ బర్త్ డే త్రిష’ – ఇప్పటికీ నీలో మార్పు లేదు..!

Film Celebrities Radhika and Khushbu Greet Birthday Wishes To Trisha Krishnan On Twitter
Film Celebrities Radhika and Khushbu Greet Birthday Wishes To Trisha Krishnan On Twitter

‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమై .. ‘వర్షం’ సినిమాతో తెలుగు సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న హీరోయిన్ త్రిష. ఆ తర్వాత వరుస సినిమాలతో తక్కువ టైంలోనే స్టార్ హీరోల పక్కన నటించి ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని దాదాపు దశాబ్దంన్నర పాటు స్టార్ హీరోయిన్ గా వెలిగింది. గత ఏడాది తమిళ చిత్రం ‘96’లో జానకి దేవి పాత్రలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచింది. ప్రస్తుతం కొత్త హీరోయిన్స్ రావడంతో తెలుగులో కాస్త జోరు తగ్గినా… తమిళ్, మలయాళంలో మాత్రం వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈరోజు త్రిష తన పుట్టినరోజు పుట్టిన రోజును జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో కావడంతో పలువురు సినీ ప్రముఖులు ట్వీటర్‌ వేదికగా త్రిషకు బర్త్‌డే విషెస్‌‌ తెలియజేస్తున్నారు.

‘హ్యాపి బర్త్‌డే డియర్‌. ఎల్లప్పుడు నువ్వు బలంగా, సానుకూలంగా ఉండాలి’ అని సీనియర్‌‌ నటి రాధిక శరత్‌కుమార్‌ శుభాకాంక్షలు తెలిపారు.

 


‘ఇప్పటికీ నీలో ఏ మాత్రం మార్పు లేదు. అదే సంతోషం, మంచి మనసు కలిగి ఉన్నావు. నీకు సంతోషం, ప్రేమ, ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నా’ అని నటి కుష్బూ త్రిషకు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు.

 

 

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here