సెన్సేషనల్ చిత్ర హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్ ” (వర్కింగ్ టైటిల్ ) మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మరో షెడ్యూల్ తో షూటింగ్ కంప్లీట్ కానున్న ఈ మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. “ఫైటర్ ” మూవీ తరువాత సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందే మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఒక యువ దర్శకుడితో ఒక మూవీ కి కమిట్ అయినట్టు విజయ్ దేవరకొండ చెప్పారు. కథ కొత్తగా ఉందని, స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని విజయ్ తెలిపారు. శివ నిర్వాణ మూవీ తరువాత ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని, ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే చెబితే మజా ఉండదని, త్వరలోనే చెబుతానని విజయ్ తెలిపారు. కొత్త దర్శకుడితో విజయ్ కు ఒక డిఫరెంట్ మూవీ రూపొందే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: