కరోనా వైరస్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు బాధ్యతగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ పేద వారికి, రోజు కూలీలకు చాలా పెద్ద సమస్యగా మారిందనే చెప్పొచు. అందుకే వారికి సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి తమ భాద్యతగా వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది తమకు తోచినంత విరాళాలు అందించగా ఇప్పుడు ఈ లిస్ట్ లో సాయికుమార్ ఫ్యామిలీ కూడా చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




తాజాగా డైలాగ్ కింగ్ సాయికుమార్ ఆయన కుమారుడు హీరో ఆది సాయి కుమార్ కరోనా క్రైసిస్ చారిటీకి విరాళం అందించారు. సాయి కుమార్ ఫ్యామిలీ రూ. 7 లక్షల 12 రూపాయాలను విరాళం అందజేయడం జరిగింది. రూ. 5 లక్షల 4 రూపాయలను విరాళంగా అందజేసారు. అలాగే డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్‌కు కూడా సాయి కుమార్ తన వంతుగా రూ.1 లక్ష 8 రూపాయలను విరాళంగా అందజేయడం జరిగింది. అంతేకాదు సాయికుమార్ సోదరుడు రవిశంకర్ కూడా తన వంతుగా రూ. లక్ష రూపాయలను విరాళంగా అందచేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: