90%సక్సెస్ రేట్ కలిగిన టాప్ స్టార్ అల్లు అర్జున్ అన్నది నిర్వివాదాంశం

Telugu FilmNagar Wishes Stylish Star Allu Arjun A Very Happy Birthday

అతను వారసత్వ హీరో అని చెప్పలేము. సాధారణంగా వారసత్వ హీరోలకు తమ తండ్రుల ద్వారా గొప్ప అభిమాన సంపద సంక్రమిస్తుంది. అయితే ఆయన తండ్రి, తాతలు సినీ ప్రముఖులే అయినప్పటికీ వారి పేరు ప్రఖ్యాతుల వల్ల ఇతని కెరీర్ కు పెద్దగా ఒరిగిందేమీ లేదు. కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే నేపథ్యమే తప్ప ఒక వారసత్వ హీరోను ఇంట్రడ్యూస్ చేయటానికి, నిలబెట్టటానికి అవసరమైనంత ప్రత్యేక ప్రయత్నాలు ఏవీ అతని విషయంలో జరగలేదు. అందుకే దశాబ్దాల చరిత్ర ఉన్న సినీ కుటుంబం నుండి వచ్చినప్పటికీ అతన్ని వారసత్వ హీరో అనలేము. వారసత్వ హీరో అయి ఉంటే హీరోగా తన మొదటి సినిమా ” గంగోత్రి” లో అంత ‘అండర్ డాగ్ ‘ క్యారెక్టర్ చేసేవాడు కాదు. భారీ తారాగణం, భారీ సెట్టింగులు, భారీ బడ్జెట్ తో అత్యంత భారీ స్థాయిలో ప్రజెంట్ చేయబడే వాడు. రెగ్యులర్ గా జరిగే వారసత్వ హీరోల ప్రజెంటేషన్ కు భిన్నంగా content is the King అనే కాన్సెప్టుతో పరిచయమై ఈరోజు one of the Top Stars of Tollywood గా ఎదిగిన ఆ హీరో అల్లు అర్జున్ అని
మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అయితే వారసత్వ హీరో కాకపోయినప్పటికీ మేనమామ అయిన మెగాస్టార్ చిరంజీవి తాలూకు అభినందనలు, ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో అల్లు అర్జున్ పట్ల ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. అయితే తన కుటుంబ నేపథ్యం , మెగా కాంపౌండ్ ఇమేజ్ తన పరిచయానికి పనికి వస్తాయే గాని తన సక్సెస్ కు, తన ప్రోగ్రెస్ కు పనికిరావు అన్న రియలైజేషన్ అల్లు అర్జున్ లో మొదటి చిత్రం నుండే కనిపించింది. ఇప్పటి వరకు సాగిన తన 19 చిత్రాల కెరీర్లో ఆ అవేర్నెస్ , ఆ అప్రమత్తత ప్రతి చిత్రంలోనూ కనిపిస్తుంది. తాత అల్లు రామలింగయ్య , తండ్రి అల్లు అరవింద్ మేనమామ మెగాస్టార్ చిరంజీవి గార్లు అభినందనలు, ఆశీస్సులు అందించగలరే తప్ప తను నిలబడటానికి , హీరోగా నిలదొక్కుకోవడానికి కావలసిన తారక మంత్రం “హార్డ్ వర్క్” అని త్రికరణశుద్ధిగా నమ్మి ఆచరించాడు కాబట్టే ఈ రోజున అల్లు అర్జున్ అంటే An Icon of Style and Stamina అనే అభినందనలు అందుకుంటున్నారు.

2003లో ‘ గంగోత్రి ‘ చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించి 17 ఏళ్లలో 19 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8. 1982 ఏప్రిల్ 8న మద్రాసులో జన్మించిన అల్లు అర్జున్ ఈ జన్మ
దినంతో 38వ పడిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ స్టైలిష్ స్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తన కెరీర్ గురించి కొన్ని ప్రశంసార్హం అయిన కొన్ని ప్రత్యేక విషయాలను, విశేషాలను ప్రస్తావించుకుందాం.

మోస్ట్ సక్సెస్ ఫుల్ కెరీర్:

దాదాపు తొమ్మిది దశాబ్దాల చరిత్రలోఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్ రేటు10 నుండి 15 శాతం అయితే అందులో హీరోల పర్సనల్ సక్సెస్ రేట్ 50 నుండి 70 శాతం ఉంటుంది. అయితే అతి కొద్ది మంది హీరోలకు మాత్రమే 90 శాతం సక్సెస్ రేటు నమోదు అవుతుంది. అలా 90% సక్సెస్ రేటు తో టాప్ ర్యాంకర్ గా నిలిచిన రేర్ స్టార్ అల్లు అర్జున్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా తన హిట్ చిత్రాల మొత్తం జాబితాను ఇవ్వటం కంటే తన 19 చిత్రాలలో బాగా డిజప్పాయింట్ చేసిన రెండే రెండు చిత్రాలను పేర్కొనటం బెటర్ . వరుడు, నా పేరు సూర్య ఈ రెండు చిత్రాలు తప్ప మిగిలిన అన్ని చిత్రాలు కొద్దిపాటి హెచ్చుతగ్గులతో విజయవంతమయ్యాయి. వీటిలో కూడా ఎవరేజ్ చిత్రాలు తక్కువ హిట్ చిత్రాలు ఎక్కువగా ఉండటం విశేషం.
కాబట్టి ఏ స్టార్ స్టామినాకైనా సక్సెస్ రేటే కొలమానం కాబట్టి ఆ దామాషాలో చూస్తే Allu Arjun is the most successful star of the present generation అని చెప్పవచ్చు.

స్టైల్ ఐకాన్:

అల్లు అర్జున్ పేరుకు ముందు ‘స్టైలిష్ స్టార్ ‘ అనే ఒక ప్రీఫిక్స్ ను ఎప్పుడు ఎవరు చేర్చారో తెలియదు గాని ఆ అభినందనకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేలా ఉంటుంది అల్లు అర్జున్ స్టైలిష్ పర్ఫార్మెన్స్. ప్రతి హీరోకి ఒక స్టైల్ ఉంటుంది. అయితే ఎవరికి దక్కని ఈ అభినందన అల్లు అర్జున్ కు మాత్రమే దక్కటానికి కారణం ఏమిటి అని విశ్లేషిస్తే తను ఎంచుకునే స్క్రిప్ట్ అండ్ క్యారెక్టర్లే అతనికి ఆ ఇమేజ్ తెచ్చాయి అన్నది 19 సార్లు రుజువైన వాస్తవం. పైకి చాలా అవలీలగా ఆడుతూ పాడుతూ చేస్తున్నట్లుగా అనిపించే అల్లు అర్జున్ పాత్రల్లో అంతర్లీనంగా విపరీతమైన సంఘర్షణ ఉంటుంది. పాత్రను దాని స్వభావాన్ని ఆకళింపు చేసుకునే డీప్ స్టడీ వల్లనే అల్లు అర్జున్ ఒక విభిన్నమైన స్టైలిష్ ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నారు. ముఖ్యంగా ఆర్య, ఆర్య 2, హ్యాపీ, జులాయి,రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రీసెంట్ గా సంచలన విజయాన్ని సాధించిన అల వైకుంఠపురం చిత్రాల్లో అల్లు అర్జున్ కనబరిచిన ట్రెండ్ సెట్టింగ్ పర్ఫార్మెన్స్ కు యూత్ ఫిదా అయింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక పూర్తిస్థాయి మాస్ మసాల చిత్రాలు అయిన దేశముదురు, బన్నీ, బద్రీనాథ్, సరైనోడు,దువ్వాడ జగన్నాథం వంటి చిత్రాలలో పరమ ఊర పాత్రలకు కూడా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ని, క్లాస్ టచ్ నీ అడాప్ట్ చేస్తూ అల్లు అర్జున్ ప్రదర్శించిన ఆల్ రౌండ్ షో అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరించింది. నిజానికి అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ లో గమ్మత్తయిన రహస్యం ఒకటుంది. క్లాస్ క్యారెక్టర్స్ కు లైట్ మాస్ టచ్ ఇవ్వటం… మాస్ క్యారెక్టర్స్ కు చిన్న క్లాస్ టచ్ ఇవ్వటంలో అల్లు అర్జున్ నిజంగా మహా ముదురు. Really its a very clever approach towards the character. నిజానికి ఇలాంటి అప్రోచ్ దర్శకులు క్రియేట్ చేసిన క్యారెక్టర్ లో లేకపోయినప్పటికీ అల్లుఅర్జున్ ఇచ్చే బెటర్మెంట్ వాళ్లను కూడా కన్విన్స్ చేస్తుంది.

Take it as granted అనుకోడు:

అల్లు అర్జున్ విషయంలో మరొక అభినందనీయమైన అంశం ఏమిటంటే తాను దేనిని take it as granted గా తీసుకోడు. స్క్రిప్ట్, క్యారెక్టర్, డాన్స్, ఫైట్స్, ప్రొడక్షన్ వంటి సమస్త విషయాలలో పూర్తిస్థాయి నిమగ్నతను, ఏకాగ్రతను కనబరుస్తాడు అల్లు అర్జున్. నిజానికి కొన్ని డాన్స్ సీక్వెన్స్ లో, ఫైట్స్ లో అల్లు అర్జున్ పడే కష్టాన్ని, తీసుకునే రిస్క్ ను చూస్తే ఇంతగా ఒళ్ళు గుల్ల
చేసుకోవటం అవసరమా అనిపిస్తుంది.

తెరమీద చాలా ఈజీగా, స్టైల్ గా కనిపించే అతని ప్రజెన్స్ వెనుక ఒళ్ళు హోనం చేసుకునే కష్టం దాగి ఉంటుంది. దర్శక నిర్మాతలు, డాన్స్ మాస్టర్స్, ఫైట్ మాస్టర్స్ చేసే దాని కంటే పది రెట్లు హోం వర్క్ చేస్తాడు అల్లు అర్జున్. గొప్ప పేరు వచ్చింది… స్టైలిష్ స్టార్ అనే బిరుదు వచ్చింది…
వరుస విజయాలు వచ్చాయి… ఇంకేం కావాలి అనే రిలాక్స్డ్ యాటిట్యూడ్ అల్లు అర్జున్ లో మచ్చుకైనా కనిపించదు అంటారు అతనితో పనిచేసే దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్. A success demands more than a failure అన్నది అల్లు అర్జున్ నమ్మే సిద్ధాంతంగా అనిపిస్తుంది. అపజయం బాధను పెంచితే విజయం బాధ్యతను పెంచుతుంది అనే బాధ్యతాయుతమైన ఆలోచనా విధానమే అల్లు అర్జున్ ను మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టార్ గా నిలబెట్టింది.

పాత్రల ఎంపికలో ప్రత్యేకత…

ఒక కమర్షియల్ స్టార్ తను ఎంచుకునే ప్రతి పాత్రలో , ప్రతి స్క్రిప్టులో తనదే పైచేయిగా ఉండాలని కోరుకోవటం సహజం. రెగ్యులర్ గా చేసే ఫుల్ ప్లెడ్జ్డ్ క్యారెక్టర్స్ విషయంలో అల్లు అర్జున్ కూడా అలాగే ఆలోచిస్తారు. అయితే తన కెరీర్ మొత్తం మీద రెండు ప్రత్యేక పాత్రల పోషణ ద్వారా అల్లు అర్జున్ తన ప్రత్యేకతను గొప్పగా ఆవిష్కరించనున్నారు. అవి వేదం, రుద్రమదేవి చిత్రాలు. ఈ రెండు చిత్రాల విషయంలో అల్లు అర్జున్ ప్రదర్శించిన విజ్ఞత శతధా అభినందనీయంగా అనిపిస్తుంది. ఒక స్టైలిష్, గ్లామరస్, యాక్షన్ హీరోగా గొప్ప స్థాయిని, మార్కెట్ ను ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఉమెన్ సెంట్రిక్ చిత్రమైన ‘వేదం ‘లో ఒక దొంగ పాత్రను అంగీకరించటాన్ని అల్లు అర్జున్ “స్టాండర్డ్ ఆఫ్ థింకింగ్ “కు గొప్ప నిదర్శనంగా చెప్పుకోవాలి. ఆ స్థాయిలో, ఆ సమయంలో అలాంటి డీగ్లామరైస్డ్ సెకండరీ క్యారెక్టర్ ను ఏ స్టార్ అయినా ఒప్పుకుంటాడా….!? అయితే అల్లు అర్జున్ ఎందుకు ఒప్పుకున్నారు అంటే ఆ పాత్రలో మంచికి చెడుకు మధ్య ఒక డోలాయమాన సందిగ్ధ సంఘర్షణ ఉంది… పేదవాడి ఆశలకు అవకాశాలకు మధ్య నలిగిపోయే నిస్సహాయమైన నిజాయితీని గొప్పగా అభినయించే అవకాశం ఆ కేబుల్ రాజు పాత్రలో ఉందన్న నమ్మకంతోనే ఆ పాత్రను అంగీకరించి అద్భుతంగా నటించారు అల్లు అర్జున్. అలాగే రుద్రమదేవి చిత్రంలో గోనగన్నారెడ్డి పాత్రను అంగీకరించడం ద్వారా ఒక చిరస్మరణీయమైన ఖ్యాతిని సొంతం చేసుకున్నారు బన్నీ. అలాగే ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ నా పేరు సూర్య లో పోషించిన సోల్జర్ పాత్రలో అల్లు అర్జున్ అభినయం అద్భుతం. ఇంకా తను నటించిన ప్రతి చిత్రంలోనూ ” స్టీలర్ ఆఫ్ ద షో ” గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ స్టైలిష్ స్టార్ అనే అభినందనను అక్షర సత్యం చేసుకుంటున్నారు అల్లు అర్జున్.

ఫస్ట్ సిక్స్ ప్యాక్ స్టార్:
ఒక పాత్రను చాలెంజ్ గా తీసుకుంటే ఆ చాలెంజ్ ను మీట్ అవటం కోసం ఎంత కష్టాన్నైనా ఆహ్వానించే డేరింగ్ నేచర్ అల్లు అర్జున్ సొంతం. టాలీవుడ్ లో ఫస్ట్ టైం సిక్స్ ప్యాక్ బాడీ బిల్డప్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన క్రెడిట్ అల్లు అర్జున్ కే దక్కుతుంది ‘ ‘దేశముదురు’ చిత్రం కోసం చేసిన సిక్స్ ప్యాక్ విన్యాసాలు ఒక సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేయగా’ ద సల్మాన్ ఆఫ్ సౌత్’ అనే అభినందనలు అందుకున్నారు అల్లు అర్జున్. నిజానికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలి అనుకుంటే అందుకు తగిన మేకోవర్ తో ఆ నటుడు ప్రిపేర్ అవ్వాలి. అంతేకానీ పాత్ర స్వభావ స్వరూపాలకు సంబంధంలేని గెటప్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేయకూడదు. ఫలితం ఎలా ఉన్నప్పటికీ ‘నా పేరు సూర్య’ చిత్రంలో పోషించిన మిలటరీ గెటప్ కోసం తీసుకున్న రిస్కు , సాధించిన మేకోవర్ చూస్తే పాత్ర కోసం ఎలాంటి సాహసానికైనా వెనుకాడని అల్లు అర్జున్ డెడికేషన్ ను అభినందించకుండా ఉండలేము. అలాగే బద్రీనాథ్ చిత్రంలో కూడా అల్లుఅర్జున్ ప్రదర్శించిన దేహ థారుఢ్యం ఆయన మనో థారుఢ్యానికి సంకేతంగా నిలుస్తుంది. ఇలా పాత్ర కోసం ప్రాణం పెట్టే అంకిత నైజం చాలా అరుదుగా కనిపిస్తుంది. అది తనలో
ఉండటమే అల్లు అర్జున్ ను మిగిలిన హీరోల కంటే ప్రత్యేకంగా నిలిపింది.

నాడు చిరంజీవి – నేడు అల్లు అర్జున్:

కొన్ని కొన్ని సంఘటనలు, సందర్భాలు చాలా యాదృచ్చికంగా మ్యాచ్ అవుతుంటాయి. నిజానికి 2003లో గంగోత్రి తో హీరోగా కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ కెరీర్ లో ఈ 17 సంవత్సరాలలో ఎప్పుడు గ్యాప్ రాలేదు. సంవత్సరానికి ఒకటి … రెండు సందర్భాల్లో రెండు చొప్పున రిలీజ్ లు కలిగి ఉన్న అల్లు అర్జున్ కు 2019 నో రిలీజ్ ఇయర్ గా మిగిలిపోయింది. ఈ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో జరిగిన ఒక విశేషాన్ని ప్రస్తావించాలి. “ఘరానా ఆమొగుడు” వంటి సంచలన విజయం తరువాత మెగాస్టార్ చిరంజీవికి కొన్ని అనూహ్య పరాజయాలు ఎదురయ్యాయి… అలాంటి విపత్కర పరిస్థితుల్లో దాదాపు సంవత్సరం పాటు విరామం తీసుకున్నారు చిరంజీవి. అది ఆయన కెరీర్లో వచ్చిన తొలి గ్యాప్. ఇది జరిగింది 1996లో.
ఆ తరువాత 97 సంక్రాంతికి ‘హిట్లర్ ‘ అనే మెగా హిట్ తో పునః విజృంభించారు చిరంజీవి. అలాగే 2019లో ఒక్క రిలీజ్ కూడా లేని అల్లు అర్జున్ 2020 సంక్రాంతికి ‘అల వైకుంఠ పురంలో ‘ అనే రికార్డ్ బ్రేకింగ్ హిట్ తో కం బ్యాక్ అవటం ఒక యాదృచ్ఛిక విశేషం. డాన్సులు, ఫైట్స్, స్టైల్స్ వంటి చాలా విషయాల్లో తనకు తెలియకుండానే మెగాస్టార్ ఇన్ఫ్లుయెన్స్ ను, ఇన్స్పిరేషన్ ను
అడాప్ట్ చేసుకున్న అల్లు అర్జున్ కు కం బ్యాక్ విషయంలో కూడా ఆయన లాగే జరగటం కాకతాళీయమే అయినప్పటికీ ఇదొక స్వీట్ హ్యాపెనింగ్ గా నిలిచిపోతుంది.

ఆ విషయంలో వన్ అండ్ ఓన్లీ బన్నీ:

ఒక రాష్ట్రంలో పాపులర్ అయిన స్టార్ డబ్బింగ్ చిత్రాల ద్వారా మరొక రాష్ట్రంలో కూడా గుర్తింపు పొందటం సహజం. ఇవి చాలా మంది స్టార్స్ విషయంలో జరిగేదే. అయితే తన సొంత రాష్ట్రంలో ఉన్న ఇమేజ్ కి, పాపులారిటీ కి సరిసమానమైన క్రేజ్ ను, డిమాండ్ ను పరాయి రాష్ట్రంలో కూడా సంపాదించుకోవడం చాలా చాలా అరుదైన విజయ విశేషం. పొరుగు రాష్ట్రంలో అలాంటి ఇమేజిని సాధించుకున్న వన్ అండ్ ఓన్లీ తెలుగు స్టార్ అల్లు అర్జున్ కావడం ఆశ్చర్యానందకరం. మన పొరుగు రాష్ట్రమైన కేరళలో అల్లు అర్జున్ కు అక్కడి అగ్రతారలకు ఏ మాత్రం తీసిపోని డిమాండ్, మార్కెట్ ఏర్పడటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభం అయితే ఇక్కడ కంటే వేగంగా కేరళలో బిజినెస్ క్లోజ్ అవ్వటం పట్ల తెలుగు, మలయాళ ట్రేడ్ వర్గాలు, మీడియా విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తుంటాయి. ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పాపులారిటీ ఉండేది. ప్రస్తుతం అలా ఓవర్ స్టేట్ పాపులారిటీని ఎంజాయ్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ప్రొఫెషనల్ రెస్పెక్ట్:

కొంతమంది సినిమా వాళ్ళకు తమ జీవనాధారమైన సినిమా రంగం పట్ల చాలా నీచమైన అభిప్రాయం ఉంటుంది. తమ భార్యా పిల్లలను సినిమా వాతావరణానికి దూరంగా పెట్టి అదేదో గొప్ప ఘనకార్యంగా ఫీలవుతుంటారు. “అబ్బే మా వాళ్ళను ఈ సినిమా వాతావరణం దరిదాపులకు కూడా రానివ్వను ” – అని గర్వంగా చెబుతుంటారు. తాము కొనసాగుతున్న రంగం పట్ల అంత తక్కువ అభిప్రాయం ఉన్నప్పుడు ఈ రంగంలో ఎందుకు ఉండాలి? అయితే అల్లు అర్జున్ లాంటి సంస్కార వాదులు మాత్రం ఇలాంటి చెత్త ఆలోచనలకు భిన్నమైన ఐడియాలజీ ని అనుసరిస్తారు. అల్లు అర్జున్ తన ఇద్దరు పిల్లల అల్లరిని, ముద్దు ముచ్చట్లను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అలా ఎందుకు చేస్తారు అని మీడియా వాళ్లు అడిగినప్పుడు అల్లు అర్జున్ చెప్పిన సమాధానం నిజంగా అతని వ్యక్తిత్వం లోని నిజాయితీకి, వృత్తి గౌరవానికి అద్దం పడుతుంది. ” మా పిల్లలకు నేను ఎవరో… నా వృత్తి ఏమిటో తెలియాలి. మా తాతగారు, మా నాన్నగారు నన్ను సినిమాలకు దూరంగా పెడితే నేను ఈరోజు ఈ పొజిషన్ లో ఉండే వాడిని కాదు. నా పిల్లలకు నా గురించి, నా ప్రొఫెషన్ గురించి తెలియాలి… అని చెప్పిన సమాధానంలో ఎంత నిజాయితీ, ఎంత ప్రొఫెషనల్ రెస్పెక్ట్ ఉన్నాయో కదా! సినిమా ఇండస్ట్రీ లోనే ఉంటూ సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడే కుహనా మేధావులు అల్లు అర్జున్ అభిప్రాయాన్ని చూసైనా తమ అభిప్రాయాలు మార్చుకుంటారని ఆశిద్దాం.

చారిటీ హార్ట్:

మనిషి ఎంతటి వీరుడు, శూరుడు, ధీరోదాత్తుడు , సకల కళా పండితుడు, సకల కళా వల్లభుడు అయినప్పటికీ అతనిలో దాతృత్వ లక్షణం లేకపోతే వాడి సంపాదనకు, సంపదకు అర్థం లేనట్లే. కానీ కొంతమంది కోటానుకోట్లు సంపాదించినా పిల్లికి బిచ్చం పెట్టరు… ఎంగిలి చేత్తో కాకిని విసరరు… అయితే అల్లు అర్జున్ లాంటి రియల్ హీరోస్ ఎంత స్టైలిష్ గా సంపాదిస్తారో
అంత ఉదారంగా తమ వితరణను ఆవిష్కరించుకుంటారు. వరదలు, తుఫాన్లు, నేటి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడిన ప్రతి సందర్భంలోనూ అల్లు అర్జున్ భూరి విరాళాలు ప్రకటించడం అభినందనీయం. ఇతర హీరోల చారిటీ కేవలం మన రాష్ట్రం వరకే పరిమితం.. కానీ కేరళలో కూడా సమాన ప్రాచుర్యం కలిగిన అల్లు అర్జున్ అక్కడ కూడా తన చారిటబుల్ యాక్టివిటీని కొనసాగించటం సంథింగ్ గ్రేట్ అనే చెప్పుకోవాలి.

ఇలా చెప్పుకుంటూ పోతే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఇంకా ఎన్నో విశేషాలు, ప్రత్యేకతలు కనిపిస్తాయి. హీరోగా తన తొలి చిత్రం’ గంగోత్రి ‘ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు నూరవ చిత్రం కావటం ఒక విశేషమైతే… ఆ శత చిత్రదర్శకుడు నుండి రెండవ చిత్రానికి ఎలాంటి అనుభవం లేని నూతన దర్శకుడు సుకుమార్ తో పనిచేయటం ఒక స్ట్రైకింగ్ పాయింట్. అలాగే తొలి చిత్రం గంగోత్రి లో మీసం లేకుండా , సరైన మేకప్ లేకుండా, ఒక గెటప్, ఒక ప్రజంటేషన్ వాల్యూస్ వంటివి ఏమీ లేకుండా పేడి ముఖంతో కనిపించిన ఈ అబ్బాయే నేటి “స్టైలిష్ ఐకాన్ ” అంటే నమ్మలేనంతటి వ్యత్యాస, వైవిధ్యాలను ఆవిష్కరించడం …

something great
something special
&
something unusual…

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here