సూపర్ స్టార్ కృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్ లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వాటిలో `కిరాయి కోటిగాడు` ఒకటి. మ్యూజికల్ హిట్ గా నిలచిన ఈ మాస్ ఎంటర్ టైనర్ ని ఎ.కోదండరామి రెడ్డి డైరెక్ట్ చేయగా.. రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై యన్. రామలింగేశ్వరరావు నిర్మించారు. రావుగోపాల రావు, అల్లు రామలింగయ్య, శ్రీధర్, ముచ్చర్ల అరుణ తదితరులు ఇందులో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ మాస్ ని ఉర్రూతలూగించాయి. `నమస్తే సుస్వాగతం`, `కూడబలుక్కుని`, `పట్టుమీద ఉన్నాది`, `ఎక్కితొక్కి నీ అందం`… ఇలా పాటలన్నీ విశేషాదరణ పొందాయి. 1983 మార్చి 17న విడుదలై ఘనవిజయం సాధించిన `కిరాయి కోటిగాడు`… నేటితో 37 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: