ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంధాదున్’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా చేసిన ఆయుష్మాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రీమేక్ తెరకెక్కనుంది. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా… ఈ రోజు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. టాలీవుడ్ ప్రముఖులు శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు సురేందర్ రెడ్డి మరియు దిల్ రాజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ చిత్ర షూటింగ్ జూన్ నుండి మొదలుకానుంది. ఈ చిత్రంలోని నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
[custom_ad]
ఇదిలా ఉండగా ఇప్పటీకే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. చంద్రశేఖర్ యేలేటి, ‘ఛల్ మోహన్ రంగా’ చేసిన కృష్ణచైతన్యతో చేయనున్నాడు నితిన్. మొత్తానికి భీష్మ సినిమాతో నితిన్ ఫామ్ లోకి వచ్చిన నితిన్ వరుస సినిమాలతో సందడి చేయనున్నాడు. చూద్దాం మరి ఈ సినిమాలు ఎంతవరకూ సక్సెస్ తెచ్చిపెడతాయో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: