గేమ్ స్టార్ట్ చేసిన మెగా ప్రిన్స్

Mega Prince Varun Tej Joins His New Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Varun Tej,Varun Tej Latest News,Varun Tej Upcoming Film News,Varun Tej Next Project News,Varun Tej Latest Movie Details

వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. దీనిలో భాగంగానే వరుణ్ ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇక ఇన్ని రోజులు ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకున్న చిత్రయూనిట్ ఈ రోజు నుండి షూటింగ్ ను మొదలుపెట్టారు. వైజాగ్లో ఈ సినిమా షూటింగ్ తెలుస్తుంది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కు ఫిక్స్ చేశారు. జులై 30, 2020 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు ముద్ద మరియు అల్లు వెంకటేష్ కలిసి నిర్మిస్తున్నారు. ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జార్జ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఇక హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

మరి ఎఫ్2, వాల్మీకి, ఇలా వరుస వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు వరుణ్ తేజ్. దీనితో ఈ సినిమాపై కూడా మెగా అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =