`ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `రెడ్`. తమిళ సినిమా `తడమ్` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. `నేను శైలజ`, `ఉన్నది ఒక్కటే జిందగీ` అనంతరం రామ్, కిషోర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని… ఆ రెండు సినిమాలను నిర్మించిన స్రవంతి మూవీస్ నే నిర్మిస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలను అందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మాళవికా శర్మ, నివేదా పెతురాజ్, అమృతా అయ్యర్ నాయికలుగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉంటే… ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న `రెడ్`… తాజాగా ఇటలీలో రెండు పాటల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు.. హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఈ షెడ్యూల్ లో మిగిలి ఉన్న ఓ పాటను పిక్చరైజ్ చేస్తారని తెలిసింది. కాగా, వేసవి కానుకగా ఏప్రిల్ 9న `రెడ్` థియేటర్లలో సందడి చేయనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: