`నాగేశ్వ‌ర రావు`లో నాగ‌చైత‌న్య క్యారెక్ట‌ర్ డిటైల్స్

Naga Chaitanya To Play Akkineni Nageswara Rao Once Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Naga Chaitanya,Akkineni Nageswara Rao,Naga Chaitanya Latest News,Naga Chaitanya New Movie News,Naga Chaitanya Next Film Updates,Naga Chaitanya Next Project Details

గ‌త ఏడాది `మ‌జిలీ`, `వెంకి మామ‌` చిత్రాల్లో విభిన్న పాత్ర‌ల్లో అల‌రించాడు యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో `ల‌వ్ స్టోరి` చేస్తున్నాడు. శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ లో ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు చైతూ. వేస‌విలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా, ఈ చిత్రం రిలీజ‌య్యే లోపే `గీత గోవిందం` ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ లో ఓ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళ‌నున్నాడు చైతూ. 14 రీల్స్ ప్ల‌స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `నాగేశ్వ‌ర రావు` అనే టైటిల్ ప్ర‌చారంలో ఉంది. అలాగే, ఇందులో చైతూ కూడా ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ట‌. వ‌య‌సు చిన్న‌దే అయినా పాత‌కాలం భావాలూ, పెద్ద‌రికం, బాధ్య‌త‌లూ రంగ‌రించిన పాత్ర‌లో చైతూ ద‌ర్శ‌న‌మిస్తాడ‌ట‌. అంతేకాదు… పాత్ర స్వ‌భావానికి త‌గ్గ‌ట్టు `కంప్లీట్ ఫ్యామిలీ మేన్` లేదా `ప్యాక్డ్ ఫ్యామిలీ మేన్` అనే క్యాప్ష‌న్ ని `నాగేశ్వ‌ర‌రావు` టైటిల్ కి జోడించ‌నున్నార‌ట‌. క‌థానాయిక‌గా ర‌ష్మిక‌గానీ, కీర్తి సురేష్ గానీ న‌టించే అవ‌కాశముంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + two =