మ్యూజిక‌ల్ హిట్ `ప్రియ‌మైన నీకు…`కి 19 ఏళ్ళు

Musical Hit Priyamaina Neeku Completes 19 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Priyamaina Neeku,Priyamaina Neeku Movie,Priyamaina Neeku Telugu Movie,Priyamaina Neeku Movie Updates,Priyamaina Neeku Telugu Movie Latest News,19 Years For Priyamaina Neeku,Priyamaina Neeku Movie Completed 19 Years,Priyamaina Neeku Telugu Movie Completed 19 Years

ప్రేమక‌థా చిత్రాల‌కు చిరునామాగా నిలచిన క‌థానాయ‌కుల్లో త‌రుణ్ ఒక‌రు. త‌రుణ్ న‌టించిన ప‌లు రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. వాటిలో `ప్రియ‌మైన నీకు…` ఒక‌టి. త‌రుణ్, స్నేహ నాయ‌కానాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాలో ప్రీతా విజ‌య్‌కుమార్‌, శివాజి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, చంద్ర‌మోహ‌న్‌, అలీ, వేణు మాధ‌వ్, వ‌ర్ష‌ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య భూమిక‌లు పోషించారు. సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ ప‌తాకంపై ఆర్.బి.చౌద‌రి నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను బాల‌శేఖ‌ర‌న్ తెర‌కెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర, వ‌సంత్ గీత ర‌చ‌న‌కు వీనుల విందైన బాణీలు అందించారు సంగీత దర్శకుడు శివ శంక‌ర్. “మ‌న‌సున ఉన్న‌ది” (మేల్ అండ్ ఫీమేల్ వెర్ష‌న్స్‌), “నేల‌న‌డిగా పూవుల‌న‌డిగా”, “వేయి జ‌న్మ‌లు”, “మ‌స్తు మ‌స్తు”, “న‌చ్చానురా” పాటలు శ్రోత‌ల‌ను అల‌రించాయి. వీటిలో “మనసున ఉన్నది” బాగా ప్రాచుర్యం పొందింది. 2001 ఫిబ్ర‌వ‌రి 11న మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా విడుద‌లైన `ప్రియ‌మైన నీకు`… ఈ మ‌హాశివ‌రాత్రికి 19 వ‌సంతాల‌ను పూర్తి చేసుకోవడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + twelve =