సంక్రాంతి అంటేనే రసవత్తరమైన చిత్రాలకు చిరునామా. ఏవో ఒకటి అరా సందర్భాలను మినహాయిస్తే… సంక్రాంతి బరిలో బిగ్ టికెట్ ఫిల్మ్స్ దే హవా. మరీ ముఖ్యంగా.. ఈ సీజన్ లో `క్లాష్ ఆఫ్ స్టార్స్` అనేది సర్వసాధారణం. ఈ ఏడాది కూడా `సరిలేరు నీకెవ్వరు`, `అల వైకుంఠపురములో` ఇలానే క్లాష్ అయ్యాయి. సీజన్ ని చక్కగా క్యాష్ చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
కట్ చేస్తే.. 2021లోనూ ఈ తరహా `స్టార్ క్లాష్` కొనసాగే అవకాశముందని వినిపిస్తోంది. ఏకంగా ఐదు `స్టార్` ఫిల్మ్స్ వచ్చే సంక్రాంతికి బరిలోకి దిగుతున్నాయని సమాచారం. వినిపిస్తున్న కథనాల ప్రకారం… పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్ మూవీ, మహేష్ బాబు – వంశీ పైడిపల్లి సినిమా, యన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ ఫిల్మ్, అల్లు అర్జున్ – సుకుమార్ థర్డ్ వెంచర్, నాగార్జున `బంగార్రాజు` (`సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్).. 2021 సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నాయని, జనవరి 8 – 15 లోపు తేదీల్లో ఈ సినిమాలు రిలీజవుతాయని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.
[custom_ad]
మరి.. చివరాఖరికి ఏ యే చిత్రాలు 2021 పొంగల్ బరిలో ఉంటాయో తెలియాలంటే మాత్రం మరో పది నెలలు వెయిట్ చేయకతప్పదు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: