ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తున్న అనిల్ రావిపూడి

Sarileru Neekevvaru Director Anil Ravipudi Continues This Tradition

`ప‌టాస్`తో ద‌ర్శ‌కుడైన అనిల్ రావిపూడి.. అన‌తికాలంలోనే స్టార్ డైరెక్ట‌ర్ అనిపించుకున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజైన `స‌రిలేరు నీకెవ్వ‌రు`తో ద‌ర్శ‌కుడిగా మ‌రో మెట్టు ఎక్కాడు. అంతేకాదు.. అనిల్ డైరెక్ట్ చేసిన సినిమాలు.. ఆయా హీరోల‌కు కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ అవుతాయ‌న్న సెంటిమెంట్ ని కొన‌సాగించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

అనిల్ తొలి చిత్రం `ప‌టాస్`తో క‌ళ్యాణ్ రామ్ కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ చూస్తే.. రెండో చిత్రం `సుప్రీమ్` అప్ప‌ట్లో సాయితేజ్ కి కెరీర్ బెస్ట్ హిట్ గా నిల‌చింది. ఇక అనిల్ మూడో సినిమా `రాజా ది గ్రేట్`తో ర‌వితేజ కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ అందుకుంటే.. నాలుగో చిత్రం `ఎఫ్ 2`తో వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ఇద్ద‌రు కూడా కెరీర్ లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ చూశారు. ఇక ఐదో సినిమాగా వ‌చ్చిన `స‌రిలేరు నీకెవ్వ‌రు`తోనూ ఆ ప‌రంప‌ర కొన‌సాగి.. స‌ద‌రు చిత్రం మ‌హేష్ బాబు కెరీర్ లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ అయింది. మ‌రి… రానున్న చిత్రాల‌తోనూ అనిల్ ఈ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =