2019 మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు స్పెషల్ ఇయర్ అని చెప్పొచ్చు. వెంకీమామ, ప్రతి రోజూ పండగే, ‘అల వైకుంఠపురములో’, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటరు’, ఇంకా చాలా సినిమాలు వచ్చాయి. వచ్చిన అన్ని ఆడియోలు దాదాపు హిట్ అయ్యాయి. అందులో ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ ‘సామజవరగమనా’, ‘రాములో రాములా’ పాటలు 2019 లోనే బెస్ట్ సాంగ్స్ గా అత్యధిక వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసాయి. అంతేకాదు బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాకి కూడా తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనల్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాకి కూడా తమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ఇంకా పలువురు డైరెక్టర్ లు కూడా తమ సినిమాలకు తమన్ నే తీసుకోవాలని చూస్తున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా థమన్ పై కన్నేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో థమన్ కొన్ని సినిమాలకు వర్క్ చేశాడు. సింబా – గోల్ మాల్ 4 సినిమాలకుకొన్ని సాంగ్స్ కంపోజ్ చేశాడు. ప్రస్తుతం రెండు కథలు డిస్కర్షన్స్ లో ఉన్నాయట. సెట్స్ పైకి వెళితే.. థమన్ కి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. మొత్తానికి కిక్ సినిమాతో తన ప్రయాణాన్నిమొదలు పెట్టిన తమన్ వరుస సినిమాలతో బిజీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ముందు ముందు కూడా థమన్ ఇలానే చేతినిండా సినిమాలతో బిజీగా ఉండాలని కోరుకుందాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: