కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ప్రతినిధి 2 రిలీజ్ ట్రైలర్ చూశారా?

Nara Rohith Starrer Prathinidhi 2 Release Trailer Out Now

ప్రతినిధి 2 రిలీజ్ ట్రైలర్ చూశారా?

Nara Rohith Starrer Prathinidhi 2 Release Trailer Out Now

Nara Rohith Starrer Prathinidhi 2 Release Trailer Out Now

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలాకాలం విరామం తర్వాత ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’. గతంలో ఆయన నటించి సూపర్ హిట్ అయిన 'ప్రతినిధి' చిత్రానికి సీక్వెల్‍గా ఇది రూపొందింది. తెలుగువారికి సుపరిచితమైన ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. కాగా మూర్తికి డేరింగ్ అండ్ డాషింగ్ జర్నలిస్టుగా ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. పాలిటిక్స్ నేపథ్యం కలిగిన కథాంశం కావడం, రాజకీయాలపై మూర్తికి బాగా పట్టు ఉండటం మరియు తొలిసారి డైరెక్షన్ చేస్తుండటంతో ఈ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ అయింది.

మే 10వ తేదీన ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్, పాటలు మరియు ప్రమోషనల్ కంటెంట్ అన్నీ సినిమాపై మంచి క్యూరియాసిటినీ పెంచాయి. ఈ క్రమంలో ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. ఈ మేరకు సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ అందించింది. ఇక రన్‌టైమ్‌ చూస్తే గం.2:16 (136) నిమిషాలు కలిగి ఉంది. ‘ప్రతినిధి 2’ నుంచి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రతినిధి 2 రిలీజ్ ట్రైలర్ చేశారు. ఈ కొత్త ట్రైలర్ ఎంతో ఇంటెన్సివ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.

కాగా ప్రతినిధి 2లో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనునుండగా.. సిరీ లెల్లా కథానాయికగా నటిస్తోంది. అలాగే దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తో కలిసి సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. త్వరలో తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ చిత్రం రిలీజ్ కానుండటం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్