శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఓ వార్త వినిపిస్తుంది. ఈ సినిమా నుండి ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్ తో పాటు శేఖర్ కమ్ములహోమ్ ప్రొడక్షన్ అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ వద్ద సహాయకుడిగా పనిచేసిన పవన్ సంగీతం అందిస్తున్నాడు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నాడు.
ఇక ఫిదా సినిమాతో సౌత్ లో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ములతో వర్క్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో సాయి పల్లవి క్లాసికల్ డాన్సర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మజిలీ తో చైతు కూడా మంచి హిట్ కొట్టాడు. మరి చూద్దాం వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో..? సినిమా ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: